ఫ్యాన్ ఆర్ట్ కు ఫిదా అయినా అల్లు అర్జున్.. హార్ట్ టచ్ చేసావ్ అంటూ..

ఇప్పుడంతా పుష్ప 2 మానియా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా పుష్ప రాజ్‌ పేరు మారు మోగిపోతుంది. కని..విని.. ఎరగని రేంజ్ లో హైప్‌ క్రియేట్ అయిన పుష్ప 2.. మరో వారం రోజుల్లో ఆడియన్స్ ముందుకు వచ్చి సందడి చేయనుంది. కాఆ ఈ సినిమా నుంచి.. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, కిసిక్‌ సాంగ్ యూట్యూబ్‌లో నెంబర్‌వ‌న్ ట్రెండ్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో వ‌స్తున్న ఈ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

కాగా ఇలాంటి క్ర‌మంలో బన్నీ డైహర్ట్‌ ఫ్యాన్ ఒక్కరూ తన ప్రేమను వినూత్నంగా చాటి చెప్పాడు. హ్యాండీక్యాప్డ్ అయినా.. పుష్పరాజ్ సెట్లో అల్లు అర్జున్ జాతర సీన్ గెటప్ బొమ్మ గీశాడు. తన కాళ్లతో ఈ అద్భుతమైన కళాఖండాన్ని ఆవిష్కరించి అందరిని ఫిదా చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. ఇక ఈ వీడియో తో పాటు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. అల్లు అర్జున్ సార్ దయచేసి నా ఆర్ట్‌ చూడండి. మీకోసం పుష్ప బొమ్మను గీసా.. మిమ్మల్ని క‌ల‌వాల‌ని ఎంతో కోరికగా ఉంది. ఇట్లు ధీరజ్ సాత్వికల్ అంటూ ట్యాగ్ చేసాడు.

Play With Paint - PUSHPA 2 🔥🔥 In frame:-Allu Arjun #art... | Facebook

ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో.. బన్నీ దీనిపై రియాక్ట్ అయ్యారు. హార్ట్ టచ్ చేసావ్ అంటూ అతనికి రిప్లై ఇచ్చాడు. ఇక తన అభిమాన హీరో రిప్లై ఇవ్వడంతో.. ధీర‌జ్‌ ఆనందానికి అవ‌దులు లేకుండా పోయాయి. మిమ్మల్ని ఒకసారి కలవాలి సార్. నేను మీకు పెద్ద అభిమానిని అంటూ ఆనందం వ్యక్తం చేశాడు ధీరజ్. ప్రస్తుతం ధీరజ్ చేసిన పోస్ట్ నెటింట వైరల్ అవడంతో.. అల్లు అర్జున్ అభిమానులు సైతం ధీరజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సూప‌ర్ ఆర్ట్‌.. నువ్వ చాలా గ్రేట్ బ్రో అంటూ త‌మ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.