టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయనతో పని చేసిన హీరోయిన్లు, హీరోల దగ్గర నుంచి దర్శకుల వరకు ప్రతి ఒక్కరు ఆయనతో మళ్ళీ కలిసి పనిచేయాలని ఇష్టపడుతూ ఉంటారు. ప్రభాస్ సింప్లిసిటీ, డౌన్ టు ఎర్త్ క్వాలిటీ, కల్మషం లేని మనస్తత్వం అందరిని ఫిదా చేస్తూనే ఉంటుంది. దేశంలోనే నెంబర్ వన్ స్టార్ హీరోగా వందల కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నా ప్రభాస్.. అసలు గర్వం లేకుండా సాధారణ వ్యక్తుల నడుచుకునే తత్వమే ఆయన్ను ఇంత పెద్ద స్టార్ గా నిలబెట్టింది. లక్షలాదిమంది అభిమానాన్ని తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమా రూపొందుతుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి జరీనా బహాబ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక తాజాగా జరీనా ఆన్‌సెట్స్ లో ప్రభాస్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ప్రభాస్ గురించి మాట్లాడుతూ మరో జన్మ ఉంటే నాకు ప్రభాస్ లాంటి కొడుకే కావాలి అంటూ వెల్లడించింది. అంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి.. డైన్ టూ ఎర్త్.. పెద్దలు అంటే గౌరవంతో ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఇంతవరకు నాకు ఎప్పుడు తారస పడలేదు. నేను చూడలేదంటూ చెప్పుకొచ్చింది.
అతడు పెద్ద స్టార్. కానీ.. షూట్ పూర్తయిన తర్వాత అందరితో సరదాగా ఉంటాడు. సెట్స్ నుంచి వెళ్లే సమయంలో అందరికీ బై చెబుతారు. ఇక సెట్లో ఎవరైనా ఆకలితో ఉన్నారని తెలిస్తే వెంటనే ఇంటికి ఫోన్ చేసి 40 మందికి భోజనం తయారు చేయండి అని.. ఆ భోజనం వెంటనే రావాలని ఆర్డర్ వేస్తారు. ఆయన స్వీట్ హార్ట్. నేటి జనరేషన్‌కి అతను ఇన్స్పిరేషన్. పెద్దలను ఎలా గౌరవించాలో.. ఇతరుల పట్ల ఎలా నడుచుకోవాలో.. అతని చూసి ఇప్పుడున్న జనరేషన్ యువకులు చాలా విషయాలు నేర్చుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చింది. ఇక జరీనా.. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర లోను మెరిసింది.