పుష్ప 2 కిసిక్ సాంగ్ పై శ్రీ లీల కామెంట్స్.. ఐటెం సాంగ్ అందుకే చేశా..!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీగా పుష్ప 2 ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెర‌కెక్కనున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి ఆడియన్స్ లో మరింత ఆసక్తిని నెల‌కొల్ప‌న‌ ఐటమ్ సాంగ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఐటమ్ సాంగ్‌లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల‌.. బ‌న్నీతో కలిసి చిందేసింది. కేవలం ట్రెడిషనల్ పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తు నటిస్తున్న శ్రీ లీల ఐటెం సాంగ్ చేయడమేంటి అనే సందేహం ఎంతమంది అభిమానుల్లో మొదలైంది. అయితే ఫైనల్లీ ఈ ప్రశ్నకు శ్రీలీల సమాధానం వ‌చ్చేసింది. అంత చిన్న ఏజ్ లోనే ఐటెం సాంగ్కు ఆమె ఎందుకు నటించింది అంటూ అభిమానుల్లో ఉన్న సందేహాలకు ఆమె క్లారిటీ ఇచ్చింది.

Kissik | Sreeleela's Pushpa 2 dance number Kissik to drop on Sunday; watch  teaser - Telegraph India

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా భారీ పాపులారి సంపాదించుకున్న ఈ అమ్మడు మంచి ఫామ్లో ఉన్న టైంలో పుష్పా 2 లో ఐటమ్ సాంగ్ నటించడం అందరికీ షాక్ ఇచ్చింది. దెబ్బలు పడతాయి రాజా అంటూ వేసిన ఈ అమ్మడు ఇండస్ట్రీని షేక్ చేసింది. ప్రస్తుతం యూట్యూబ్లో సాంగ్ నెంబర్ వన్ లెవెల్లో ట్రెండ్ అవుతుంది. ఇక‌ తాజాగా శ్రీ లీల తను నటించిన రాబిన్‌హుడ్‌ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని సందడి చేసింది. అందులో భాగంగా మీరు ఐటమ్ సాంగ్ లో ఎందుకు నటించారు అని ప్రశ్న ప్రెస్ నుంచి ఎదురుగా.. శ్రీ లీలా ఓపెన్ గా సమాధానం చెప్పింది. ఈ ప్రశ్న అడుగుతారని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా. నాకు ఇది వరకు కూడా చాలా ఐటెం సాంగ్స్ లో ఆఫర్స్ వచ్చాయి. కానీ.. నేను వాటిని రిజెక్ట్ చేశా. అసలు ఐటెం సాంగ్స్ అనేవి చేయకూడదని డిసైడ్ అయ్యా. కానీ.. పుష్ప 2 వేరే లెవెల్.

Sreeleela Speech | Robinhood First Connect with the Press | Nithiin | Venky  Kudumula | Tollywood

అది కేవలం ఐటమ్ సాంగ్ కాదు.. అందులో ఒక ట్విస్ట్ కూడా ఉంది. సినిమా రిలీజ్ అయ్యాక డిసెంబర్ 5న ఆ సర్ప్రైజ్ ఏంటో అర్థం అవుతుంది. కేవలం ఐటెం సాంగ్ అయితే అసలు నేను నటించేదాన్ని కాదు.. ఇక సుకుమార్ సార్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అంటూ వెల్లడించింది. అంతేకాదు ఐటెం సాంగ్ చేయడం పై నేను రిగ్రేట్ ఫీలవుతున్నాను అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి.. వాటిల్లో నిజం ఏమాత్రం లేదు. ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడం పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నా అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం శ్రీలీల చేసిన కామెంట్స్ నెట్ వైరల్ గా మారడంతో.. అమ్మడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది అంటే అందులో కచ్చితంగా ఎదో అదిరిపోయే సర్ప్రైజ్‌ ఉండి ఉంటుంది. ఇంతకీ అది ఏమయ్యి ఉంటుంది అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.