టాలీవుడ్ స్టార్ యాక్టర్ సుబ్బరాజుకు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిసిగా పవర్ ఫుల్ విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈయన.. తనకంటు ఓ ప్రత్యేక ఇమేజ్ దక్కించుకున్నాడు. అయితే తాజాగా సుబ్బరాజు చాలా చిన్న వయసు ఉన్న అమెరికన్ డాక్టర్ స్రవంతిని వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు. సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ ఆ ట్రెండ్ అవుతుంది. ఐదు పదుల వయసు దగ్గర పడుతున్నా.. నిన్న మొన్నటి వరకు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. టాపిక్ దాట్టేసిన సుబ్బరాజు.. తాజాగా 47 ఏళ్ల వయసులో స్రవంతిని వివాహం చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే ఈ స్రవంతి ఎవరు.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అయితే స్రవంతి అమెరికాలో పెద్ద డాక్టర్ అని.. ఫ్లోరిడాలో నార్త్ ఫుడ్ డెంటల్ సెంటర్లో డెంటిస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. ఆమె కొలంబియా యూనివర్సిటీ అలాగే జాన్ అప్కిన్స్ యూనివర్సిటీల నుంచి.. బిడిఎస్, డిడిఎస్, ఎంపిహెచ్ డిగ్రీ పట్టాలను కూడా అందుకుందట. ఇక ఈ అమ్మడికి సైన్స్ పట్ల ఎంత ఆసక్తి ఉందో తన ఇన్స్టా ప్రొఫైల్లో పెట్టిన చూస్తేనే అర్థమవుతుంది. ఆ ఇన్స్టాప్ ప్రొఫైల్లో.. స్రవంతి ఫస్ట్ లవ్ సైన్స్, మ్యారి టు ఫిట్నెస్ అని వెల్లడించింది. ఇక అమ్మే తన పెట్నెస్ పై శ్రద్ధతో ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ.. ఎప్పుడు హెల్తి లైఫ్ స్టైల్ పాటిస్తే చాలా క్రమశిక్షణతో ఉంటుందట.
కాగా స్రవంతి – సుబ్బరాజుల పెళ్లి ఇరుకుటుంబల సమక్షంలో.. చాలా సింపుల్ గా అమెరికాలో జరిగింది. వారి నిర్ణయం ప్రకారమే భారత్‌లో భారీగా పెళ్లి చేసుకోకుండా.. సింపుల్గా అమెరికాలో వివాహం చేసుకున్న ఈ జంట.. పెళ్లి ఫొటోస్ ప్రస్తుతం నెటింట ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే.. సినీ ప్రముఖులతో పాటు.. నెటిజన్స్ ఈ జంటకు విషెస్ తెలియజేస్తున్నారు. కాగా ఈ పెళ్లికి సింగర్ స్మిత కూడా హాజరై సందడి చేసింది. భారత సంప్రదాయ ప్రకారమే స్రవంతి కోరిక మేరకు అమెరికాలో సింపుల్గా వివాహం జరిపినట్లు సమాచారం. ఆమె యూఎస్ లోనే ఉండడం వల్ల అక్కడే పెళ్లి చేసుకున్నారట. భవిష్యత్తులో హైదరాబాదులో గ్రాండ్ రిసెప్షన్ జరగనుందని సమాచారం.