టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ఎంత హ్యాపీగా ఉన్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ ని ఎదుర్కొన్న అక్కినేని నాగార్జున.. ఆయన కొడుకులను పట్టించుకోవడం లేదంటూ.. అసలు కొడుకుల పెళ్లి పైన శ్రద్ధ లేదంటూ, వాళ్ళ కెరియర్ గురించి లెక్క చేయడం లేదంటూ, ఈన సినిమాలు, బిజినెస్, బిగ్ బాస్ అంటూ ఆస్తులు గడించడం పైనే కాన్సన్ట్రేషన్ అంత అంటూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే నాగార్జున ఈ విమర్శలన్నింటికి ఒక్కసారిగా చెక్ పెట్టాడు.
డిసెంబర్ 4న నాగ్ పెద్ద కొడుకు చైతన్య తో శోభిత పెళ్లి గ్రాండ్ లెవెల్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో అతి తక్కువ మంది బంధుమిత్రుల ఎదుట వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఘనంగా జరగనుంది. తర్వాత నాగచైతన్య తమ్ముడు అఖిల్ పెళ్లి కూడా వచ్చే ఏడాదిలో జరగనున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. ప్రముఖ బిజినెస్ మ్యాన్ కూతురు జైనబ్ రావిడ్జ్‌తో అఖిల్ నిశ్చితార్థం జరిగిన ఫోటోలు కూడా అఫీషియల్ గా షేర్ చేసుకున్నాడు నాగార్జున. ఈ క్రమంలోనే చైతు, అఖిల్ ఇద్దరి పెళ్లిళ్లకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలపై ప్రెస్మీట్లో కూల్ గా సమాధానాలు చెప్పాడు. ఒకేసారి చైతు, అఖిల్ పెళ్లి జరుగుతుందంటూ వస్తున్న ప్రచారానికి చెక్ పెడుతూ.. అదంతా ఫేక్ అని వెల్లడించాడు.
చైతు పెళ్లయ్యాక 2025లో అఖిల్ పెళ్లి జరిపించేలా ప్లాన్ చేస్తున్నామంటూ వివరించాడు. అయితే సోషల్ మీడియా వేదికగా నాగార్జున చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు నాగార్జున ఇందులో భాగంగా.. ఈ ఏడాది మొత్తం ఎంతో శుభం కలిగిందని.. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు శుభకార్యాలు జరిగాయని.. ఒకటి నాన్నగారు సతజయంతి వేడుకలు, రెండు చైతు – శోభితల పెళ్లి, మూడు అఖిల్ – జైనబ్ నిశ్చితార్థం.. ఎప్పటికీ 2024 ను అసలు మర్చిపోలేనంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి.