ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. అలా చేయాలని కూడా ఉంది.. ప్రభాస్ షాకింగ్ కామెంట్స్..

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్‌గా ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆరడజ‌న్‌ పైగా సినిమాలను లైనప్పులో పెట్టిన డార్లింగ్‌.. నుంచి పెళ్లి అప్డేట్ కోసం ఆడియన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో మరో మూడు సినిమాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడంటూ వార్తలు వినిపించడంతో.. ఇక ప్రభాస్ పెళ్లి అయినట్టే అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక సినిమాల పరంగా ప్రస్తుతం ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ రీత్యా.. ఎంతోమంది స్టార్ హీరోయిన్లు కూడా ప్రభాస్‌తో నటించడానికి ఆరాటపడుతున్నారు. ఆయనతో సినిమా అవకాశం వస్తే మిస్ చేసుకోకూడదని ఆలోచిస్తున్నారు.

Natural Star' Nani, 'Rebel Star' Prabhas, 'Stylish Star' Allu Arjun:  Popular tags given to stars from fans!

అలాంటి ప్రభాస్.. ఓ హీరోయిన్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.. హోస్ట్ అడిగిన ప్రశ్నలకు రియాక్ట్ అయ్యాడు. మీరు ఏ హీరోయిన్‌తో పని చేయాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. సాయి పల్లవి అంటే నాకు చాలా ఇష్టం. తన యాక్టింగ్ నాకు బాగా నచ్చుతుంది. సాయి పల్లవి తో కచ్చితంగా ఓ సినిమాలో చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే హీరోయిన్ సాయి పల్లవి డ్యాన్స్, స్టైల్ అంటే నాకు నచ్చుతుంది. కానీ.. మా ఇద్దరికీ హైట్ మ్యాచ్ అవుతుందో లేదో అనే డౌట్ ఉండిపోయింది అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే ప్రభాస్ లాంటి స్టార్ హీరో సాయి పల్లవి తో సినిమా చేయాలని ఉందంటూ చెప్ప‌డం ఆడియన్స్‌కు షాక్ కలిగిస్తుంది.

Prabhas - Sai Pallavi : సాయి పల్లవి మీద మనసు పడి కూడా.. పాపం ఆ రీజన్ వలన నో  అనుకున్న ప్రభాస్..

రీసెంట్గా సాయి పల్లవి అమరాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో అమ్మడి నటనకు విమ‌ర్శ‌కుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఎమోషనల్ రైడ్ గా రూపొందిన ఈ సినిమాలో.. సాయి పల్లవి పర్ఫామెన్స్‌తో ఆడియన్స్ కు కంటతడి పెట్టించింది. ఇలాంటి క్రమంలో సాయి పల్లవికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెటింట వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రభాస్ తనకు సాయి పల్లవితో నటించాలని ఉందంటూ చెప్పిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక ఇప్పటికైనా ఏ డైరెక్టర్ అయినా మేల్కొని ప్రభాస్ – సాయి పల్లవి కాంబోలో సినిమా చేస్తే బాగుండంటూ.. వీరి కాంబోలో సినిమా వస్తే నిజంగానే మంచి హైప్ నెలకొంటుంది నెలకొంటుంది అంటూ.. ఆడియన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.