బాలయ్యతో విజయ్ దళపతి.. ఇక బాక్సాఫీస్ బ్లాస్ట్ పక్కా.. !

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి టాలీవుడ్‌లోను మంచి ఫ్యాన్ బేస్‌ సంపాదించుకున్న ఈయన.. ఇటీవల సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీ పేరును కూడా ప్రకటించిన విజయ్.. సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. రీసెంట్గా వచ్చిన ది గోట్‌ సినిమా విజయ్ చివరి సినిమా అంటూ పుకార్లు వినిపించినా.. తర్వాత విజయ్‌ మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తూనే ఉన్నాడు. వాటిలో ద‌ళ‌పతి 69 గా వస్తున్న మూవీ విజయ్ లాస్ట్ సినిమా అంటూ అఫీషియల్‌గా ప్రకటించారు. అదేవిధంగా ఈ మూవీకి సంబంధించిన స్టార్ క్యాస్టింగ్ కూడా మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా టాలీవుడ్‌లో సూపర్ హిట్ మూవీ అయిన బాలయ్య భగవంత్‌ కేసరికి రీమేగా కాలివుడ్‌లో రూపొందుతుందట.

Bhagavanth Kesari: “అడవి బిడ్డ…. నేలకొండ భగవంత్ కేసరి వచ్చిండు”..  దుమ్మురేపిన భగవంత్...

బాలకృష్ణ హీరోగా.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి గత సంవత్సరం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీలో శ్రీ‌లీల‌, కాజల్ హీరోయిన్‌లుగా నటించి మెప్పించారు. కాగా ఇప్పుడు ఈ సినిమాలో బాలయ్య పాత్రలో విజ‌య్‌ నటిస్తుండగా.. శ్రీ లీల పాత్రలో మమిత బైజు కనిపించనుందని టాక్. భగవంత్ కేసరిలో బాలయ్య, శ్రీ‌లీల‌ తండ్రి కూతుళ్ళుగా కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. కాగా వ‌య‌స్సురిత్యా కథను అన్న, చెల్లిళ్ళ‌ మధ్య నడిచే కథగా చిన్న మార్పులు చేర్పులతో రూపొందించనున్నారట. ఇక హీరోయిన్గా చేసిన కాజల్ పాత్రలో పూజా హెగ్డే కనిపించనుంది. ఇక బాలయ్యతో తలపడిన అర్జున్ రాంపాల్ పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నట్లు సమాచారం. కోలివుడ్‌కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి హెచ్ వినోద్ ప్రజెంట్ చేయనున్నట్లు టాక్.

Mamitha Baiju: ప్రేమలు హీరోయిన్ అందమైన మాయ.. మమితా లుక్స్ చూస్తే ఫిదా  అవ్వాల్సిందే.. - Telugu News | Mamitha Baiju Shares stunning saree photos  goes viral telugu movie news | TV9 Telugu

ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో అసలు విజయ్ స్టార్ హీరోగా నిలబడింది తెలుగు రీమిక్స్‌తో.. ఒకడు, ఖుషి నుంచి చెప్పుకుంటూ పోతే దాదాపు విజయ్ నటించి హిట్స్ అందుకున్న సినిమాలన్నీ తెలుగు రీమేక్ సినిమాలే అంటూ పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్‌ నటించిన చివరి సినిమా కూడా తెలుగు సినిమా రీమేక్ అవడంతో అంత షాక్ అవుతున్నారు. అంతేకాదు ఇటీవల కాలంలో విజయ్ ఒక మంచి సక్సెస్ అందుకున్న దాఖలాలు లేవు. వారసుడు, లియో, ది గోట్ వరుసగా ప్లాప్లను ఎదుర్కొంటున్న విజయ్.. చివరి సినిమాతో అయినా సక్సెస్ అందుకోవాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొత్త కథతో వెళితే ప్లాప్ ఎదురవుతుందన్న భయంతోనే.. ఇలా రీమేక్లు నమ్ముకున్నాడు ఏమో అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.