ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా త్రో బ్యాక్ థీంతో సెలబ్రెటీల చిన్ననాటి పిక్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రోజుకో స్టార్ సెలబ్రిటీ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతుంది. ఇందులో భాగంగా ప్రసతుతం ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బుల్లి క్లాసికల్ డాన్సర్ ఫోటో వైరల్ గా మారింది.
ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఓ యంగ్ హీరోయిన్.. సోషల్ మీడియా హాట్ బాంబ్.. తన గ్లామర్ ట్రీట్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. మరెవరో కాదు ఐశ్వర్య మీనన్. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటూనే ఈ ముద్దుగుమ్మ సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తుంది. తమిళనాడులో జన్మించిన ఐశ్వర్య.. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంది. సినిమాపై ఉన్న ఆసక్తితో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
కాదలిల్ సోదప్పువద్దు ఎప్పడి సినిమాతో ఐశ్వర్య ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. మొదట్లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది. లవ్ ఫెయిల్యూర్ సినిమాతో హీరోయిన్గా మారిన ఈ అమ్మడు.. సినిమా సక్సస్ అవ్వడంతో మంచి ఇమేజ్ దక్కించుకుంది. దాదాపు 10 ఏళ్లకు కొనసాగిస్తున్న ఐశ్వర్యకు అందంతోపాటు.. నటన టాలెంట్ ఉన్న సరైన బ్రేక్ దొరకలేదు. అయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా అవకాశాలను దక్కించుకుంటూ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది ఐశ్వర్య.