సాధారణంగా బయట పెళ్ళికాని ప్రసాద్‌లు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఒకటికి.. రెండు, మూడు విడాకులు తీసుకుని.. నాలుగో పెళ్లి చేసుకుంటున్నా వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో మలయాళ నటుడు బాల కుమార్ ఒక్కడు. ఇటీవల ఆయన నాలుగో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 42 ఏళ్ళ వయసులో ఉన్న బాల కుమార్.. 24 ఏళ్ల వయసు ఉన్న కోకిలని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాల మాట్లాడుతూ.. మా లైఫ్ చాలా హ్యాపీగా ఉందని.. త్వరలో నాకు పాపో.. బాబో రానున్నారు. ఇదంతా చూసి మీరు కుళ్లుకుంటే నేనేం చేయలేను అంటూ కామెంట్ చేశాడు.
మీ దగ్గర డబ్బు లెక్క.. ఏ పెళ్లి అవ్వడం లేదేమో. అయినా నా నాలుగో పెళ్లిపై ఏడుస్తారే.. ప్రతి దాంట్లో తప్పులు వెతకడం అలవాటైపోయింది అంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఆయన భార్య కోకిల మాట్లాడుతూ.. చాలాకాలంగా మామను చూస్తున్నా.. కొంతకాలం నుంచి ఆయన ఒంటరిగా ఉంటున్నారు.. ఇక మామ చాలా మంచి వ్యక్తి. చిన్నప్పటి నుంచి అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. అది చూసి నేను ఆయనతో ప్రేమలో పడ్డ అంటూ వెల్లడించింది. ఇక ఈ బాల సూర్య కంగువ మూవీ డైరెక్టర్ శివకు.. తమ్ముడవుతాడు.
ఇక 2008లో చందన సదాశివ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న బాల.. అదే ఏడాదిలో ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2010లో మలయాళ సింగర్ అమృత సురేష్ ను వివాహం చేసుకున్నాడు. దాదాపు తొమ్మిదేళ్ళ కాపురంలో ఓ పాప పుట్టిన తర్వాత.. వీరు కూడా విడిపోయారు. ఇక 2020లో డాక్టర్ ఎలిజిబెత్ ఉదయాన్‌ను బాల వివాహం చేసుకున్నాడు. ఆమెతో కూడా సుదీర్ఘ ప్రయాణం సాగలేదు. పోయిన ఏడాది ఆమెకు డివోర్స్ ఇచ్చేసిన కుమారన్ ఇటీవల కోకిలను నాలుగో పెళ్లి చేసుకుని ఆడియన్స్ కు షాక్ ఇచ్చాడు.