మెగాస్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అదే… డైరెక్ట‌ర్ కూడా ఫిక్స్‌..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆరుప‌దుల‌ వయసులోను యంగ్ హీరోలకు గిట్టి పోటీ ఇస్తున్న చిరు.. 2022 ఏప్రిల్ నుంచి.. 2023 ఆగస్టు నాటికి నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఒక్క ఏడాదిలో నాలుగు సినిమాల్లో షూటింగ్స్ లో పాల్గొని సందడి చేశారు. కాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో కాస్త నెమ్మదించిన చిరు.. దాదాపు ఏడాది నుంచి విశ్వంభర సినిమా షూట్‌లో బిజీగా గడిపారు. ఇటీవల ఈ సినిమా షూట్ పూర్తయ్యింది. ఈ క్రమంలోనే చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే అంశం పై నెటింట‌ ఆసక్తి మొదలైంది.

Vishwambhara Makers share new poster on Chiranjeevi's 69th birthday - India  Today

చిరు కూడా దీనిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కాగా విశ్వంభ‌ర సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాల్సి ఉండగా.. గేమ్ ఛేంజ‌ర్‌ కోసం సినిమా రిలీజ్‌ను వెనక్కు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సమయం దొరకడంతో చిరు కాస్త బ్రేక్ తీసుకున్నారు. అనారోగ్యానికి గురైన చిరు.. పూర్తి రెస్ట్ తీసుకుంటూ పూర్తిగా కోలుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం దర్శక, రచయితలతో స్క్రిప్ట్ పై చర్చలు చేస్తున్నట్లు సమాచారం. అలా ప్రముఖ డైరెక్టర్ బి.వి.ఎస్. రవి, చిరంజీవికి ఓ స్టోరీని వినిపించారట. సోషల్ మెసేజ్‌తో కూడిన ఈ కథకు మెగాస్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. దీనికి గాడ్ ఫాదర్ ఫెమ్ మోహన్ రాజుని దర్శకుడిగా భావిస్తున్నారు. ప్రస్తుతం బి.వి.ఎస్ తో పాటు.. మోహన్‌రాజా ఈ స్క్రిప్ట్ పై పని చేస్తున్నారట.

BVS Ravi Teaming With Chiranjeevi | cinejosh.com

చిరు సూచనలు మేరకు చిన్నచిన్న మార్పులు చేసి కమర్షియల్ ఎలిమెంట్స్ తో సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామాను తెర‌కెక్కించనున్నారని తెలుస్తుంది. ఈ విషయాన్ని తాజాగా స్క్రీన్ రైటర్ బి.వి.ఎస్.రవి కృష్ణ కూడా క్లారిటీ ఇచ్చారు. చిరంజీవితో సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ తీయబోతున్నట్లు వెల్లడించాడు. ఠాగూర్, ఇంద్ర లాంటి సినిమాల తరహాలో ఇది ఉండబోతుందని.. చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వకపోయినా.. బివిఎస్ మాత్రం బాస్ తో విశ్వంభ‌ర రిలీజ్ తర్వాత ఈ సినిమా ఉండబోతుందని అఫీషియల్ గా ప్రకటించేశారు. అయితే చిరు బివిఎస్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన.. విశ్వంభర తర్వాత ఈ ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకువ‌చ్చే విష‌యంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సన్నిహిత వర్గాల సమాచారం.