టాలీవుడ్ బుల్లితెర యాంకర్ శ్రీముఖికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట ఇండస్ట్రీలో నటిగా అడుగుపెట్టి.. పలు సినిమాల్లో నటించిన ఊహించని రేంజ్‌లో సక్సెస్ అందుకొలేకపోయింది. ఈ క్రమంలోనే తర్వాత యాంకరింగ్ రంగం వైపు అడుగు వేసింది. యాంకరింగ్ లో తన సత్తా చాటుకుని మంచి ఇమేజ్ను దక్కించుకుంది. తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు రావడంతో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు తెలుగు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వ్యవహరించి విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.
రనరప్‌గా నిలిచినా ఎంతోమంది అభిమానం తన సొంతమైంది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌షో నుంచి బయటకు వచ్చిన తర్వాత.. శ్రీముఖి ఫుల్ బిజీ అయిపోయింది. ఓవైపు టీవీ షోలు, మరోవైపు ఓటీటీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూనే సినిమాల్లోనూ రాణిస్తుంది. ఇక టీవీ షోలో భారీగా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ట్రీట్‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. అందులో భాగంగానే తాజాగా శ్రీముఖి చేసిన హాట్ ఫోటోషూట్.. నెటింట తెగ వైరల్ గా మారింది.
గ్రీన్ క్రాప్ టాప్, పలాజో పైన గోల్డెన్ లేస్ గ్రీన్ కోట్ ధరించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తను వేసుకున్న కోర్ట్ పక్కకు జరుపుతూ.. హాట్ అందాలను ఫోకస్ అయ్యేలా కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం అమ్మడి హాట్ లుక్స్ నెటింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో రకరకాలుగా కామెంట్స్ చేస్తూ.. కుర్రకారు తమ క్రేజి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.