చిరంజీవి ఇండస్ట్రీ హిట్ సినిమాల లిస్ట్.. బ్లాస్టింగ్ రికార్డ్..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగా సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాదు.. టాలీవుడ్‌ని శాసించే స్థాయికి ఎదిగాడు. కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించి తిరుగులేని సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి ఎన్నో సినిమాల్లో నటించి ఇండస్ట్రియల్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలా ఇప్పటివరకు చిరంజీవి నటించిన ఇండ‌స్ట్రీహిట్ అందుకున్న సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

28 Years for Gharana Mogudu: 4 fascinating things about the Chiranjeevi  starrer

చిరంజీవి సినీ కెరీర్‌లో మొట్టమొదటి ఇండస్ట్రియల్ హిట్ ఇచ్చిన మూవీ ఖైదీ. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని విపరీతమైన పాపాలారిటి దక్కించుకున్నారు చిరంజీవి. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి నటించి హిట్ తన ఖాతాలో వేసుకున్న మరో మూవీ అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు.. ఈ సినిమాలో విజయశాంతి.. చిరంజీవికి జంటగా నటించి మెప్పించింది. ఇక చిరంజీవి హీరోగా, అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మరో మూవీ పసివాడి ప్రాణం. ఈ సినిమాతోను చిరు ఇండస్ట్రియల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఈయన నటించిన గ్యాంగ్లీడర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

Indra Re-release Pre Sales Booking Update: Chiranjeevi's Record Film Poised  For A Shattering Start At The BO - Filmibeat

ఇందులోను విజయశాంతి హీరోయిన్గా నటించి మెప్పించింది. అప్పట్లో చిరు, విజయశాంతి కాంబోకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక చిరంజీవి హీరోగా, శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఎవర్గ్రీన్ సూపర్ హిట్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి. కే. రాఘవేంద్ర డైరెక్షన్‌లో బ‌చ్చిన‌ ఇండస్ట్రియల్ హిట్గా చెరగని ముద్ర వేసుకుంది. ఈ సినిమా తర్వాత కే.రాఘవేంద్రరావు , చిరు కాంబోలో వచ్చిన మరో మూవీ ఘరానా మొగుడు. ఈ సినిమా కూడా ఇండస్ట్రియల్ హిట్. దీని తర్వాత చిరు హీరోగా ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్‌ల‌లుగా బి. గోపాల్ డైరెక్షన్ ఇంద్ర మూవీ తెర‌కెక్కింది. ఈ మూవీ కూడా అప్పట్లో కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసి ఇండస్ట్రియల్ సక్సెస్ దక్కించుకుంది.