బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌కు ప్రేక్షకులలో ప్రత్యేకపరిచయం అవపరం లేదు. దివంగత నటి.. అతిలోక సుందరిశ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ.. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక జాన్వీ బాలీవుడ్‌లో ఊహించిన రేంజ్‌లో సక్సెస్‌లు అందుకోకపోయిన మంచి నటిగా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇటీవల ఈ అమ్మడు టాలీవుడ్‌లోను అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక జాన్వీ తల్లి శ్రీదేవికి టాలీవుడ్‌తో ఎలాంటి భందం ఉందో తెలిసిందే. తన అందం, అమాయకత్వం, అభినయంతో లక్షలాదిమంది హృదయాలలో చెరగని ముద్రవేసుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో తల్లి బాటలోనే జాన్వీ కూడా టాలీవుడ్ లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో కలలుకనింది.
ఈ క్రమంలోనే అమ్మడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా దేవరలో హీరోయిన్ గా నటించింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్‌లతో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమా ఇప్పటికే 80 శాతానికి పైగా కలెక్షన్లను రాబట్టి స్టాండర్డ్ కలెక్షన్‌లతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు దేవర నుంచి వచ్చిన కలెక్షన్‌లతో ఈ సినిమా నిర్మాతలు సైతం సంతృప్తితో ఉన్నారట. ఇలాంటిక్రమంలో జాన్వీ కపూర్ తాజాగా తన అమ్మ శ్రీదేవికి ఇచ్చిన మాట గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఏ సినిమాలో అయినా జుట్టు లేకుండా ఉండే పాత్ర చేయాల్సిన పరిస్థితి ఉంటే తాను నటించబోనని ఆమె వివరించింది.
అలాంటి పాత్రలకు నేను అసలు చేయనని.. నా జుట్టు కట్ చేసుకోవడానికి నేను అసలు ఇష్టపడనంటూ చెప్పుకొచ్చింది. పాత్ర కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా నేను సిద్ధమే అని వెల్లడించిన జాన్వీ.. దఢక్ సినిమా కోసం జుట్టు కట్ చేసుకుంటే అమ్మ సీరియస్ అయిందని చెప్పుకొచ్చింది. అమ్మ జుట్టు కట్ చేసుకోవద్దని చెప్పిన మాటను నేను వింటానని.. అది ఎప్పటికి తప్పనంటూ ఆమె పేర్కొంది. తన పాత్రల కోసం జుట్టు కట్ చేసుకోవాల్సి వస్తే అలాంటి రోల్స్ నేను చేయను.. నన్ను సంప్రదించవద్దంటూ జాన్వి కామెంట్స్ చేసింది. ప్రస్తుతం జాన్వి చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో దట్ ఇజ్ శ్రీ/దఏవి డాటర్ అంటూ.. ఎప్పుడో తల్లి చెప్పిన మాటకోసం.. లైఫ్‌లో అలాంటి సినిమాలు చేయనని చెప్పడం నిజంగా గోప్ప విషయం అంటూ జాన్వి పై ప్రసంశలు కురిపిస్తున్నారు నెటిజన్స్.