ఒక‌ప్పుడు టాలీవుడ్ షేక్ చేసిన ఈ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా… అప్ప‌ట్లో కుర్రాళ్లు షేక్‌..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు అడుగుపెట్టి ఒక్క సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ఎంతోమంది టాలీవుడ్‌లో ఉన్నారు. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకొని.. తర్వాత ఎవో కారణాలతో ఒకసారిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి దూరమైపోతూ ఉంటారు. అలాంటి వారిలో ఇషా చావ్లా కూడా ఒకటి. సాయికుమార్ తనయుడు విలక్షణ నటుడు ఆది హీరోగా తెరకెక్కిన ప్రేమ కావాలి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఇషా చావ్లా.

Watch Prema Kavali (Telugu) Full Movie Online | Sun NXT

విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2011లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. ఇక తన మొదటి సినిమాలోనే అందం అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. తన డ్యాన్స్ స్టెప్పులతోనూ ఆడియన్స్ను మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాల్లో సాంగ్స్ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. అలాగే ఇషా చావ్లాకు భారీ క్రేజ్ ఏర్పడింది. ప్రేమకావాలి సినిమా సక్సెస్ కావడంతో ఈషాకు యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కింది.

అతి తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో క్లిక్ అయినా ఇషా.. తర్వాత అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీకి దూరమైంది. తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చిన సరైన స‌క్స‌స్ రాక‌పోవ‌డంతి ప‌లు సినిమాల్లో నటించిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే తాజాగా టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభరలో ఈ అమ్మడు ఓ పాత్రలో నటిస్తుందని టాక్. పదేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి తెలుగు ఆడియన్స్‌ను పలకరించనున్న ఈ ముద్దుగుమ్మ.. లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకుంది. ఈ పిక్స్ నెటింట‌ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.