శోభిత దూళిపాళ్ల టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. గూఢచారి, మేజర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. నాగచైతన్యతో సీక్రెట్ ఎఫైర్ తర్వాత సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫాన్స్ కు షాక్ ఇచ్చింది. త్వరలోనే అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టనున్న ఈ అమ్మడిపై టాలీవుడ్ ఆడియన్స్ ఫోకస్ మళ్ళింది. అయితే శోభిత పెళ్లి డేట్ పై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాకపోయినా.. తాజాగా అమ్మడి ఇంట్లో పెళ్లి సంబరాలు ప్రారంభమయ్యాయి.
శోభిత దూళిపాళ్ల గోధుమరాయి.. పసుపు దంచడం.. అంటూ ఆ పెళ్లి పనుల ఫోటోలను స్వయంగా తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె బాగుంది అంటూ.. మరికొందరు ఆమె శారి చాలా బాగుంది అంటూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శోభిత ధరించిన చీర సింపుల్గా అందంగా చాలా అట్రాక్టివ్ గా ఉందని.. మట్టి గాజులు, చంద్రహారం ధరించి అచ్చు తెలుగు ఆడపిల్లల ఆకట్టుకుంటుంది అంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆమె ధరించిన చీర ఎక్కడ కొన్నారు అనే ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓన్యూస్ వైరల్ గా మారుతుంది. ఆమె తన అత్త లక్ష్మీ చీరను ధరించినట్లు కామెంట్ రూపంలో వ్యక్తం చేశారు. దాంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు అక్కినేని ఫ్యామిలీ అంతా దూరం పెట్టిన లక్ష్మీ చీరను శోభిత సంపాదించి మరి అది పసుపు ఫంక్షన్ లో కట్టుకుందా అంటూ షాక్ అవుతున్నారు.
అయితే మరికొందరు మాత్రం సమంతతో చైతు పెళ్లి సమయంలో కూడా ఆమెకు లక్ష్మీ సపోర్ట్ ఇచ్చిందని.. తన చీర అందించిందని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా శోభిత, చైతుల పెళ్లిపై నెట్టింట చాలా నెగెటివిటీ వెలువడుతుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్ అయ్యే సోషల్ మీడియా యుగంలో ఉన్నా.. టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ సంబంధించిన వారసుడు నాగచైతన్య ఎంగేజ్మెంట్.. నాగార్జున స్వయంగా పోస్ట్ చేసే వరకు బయటకు రాలేదంటే ఎంత సీక్రెట్ గా వీరు రిలేషన్‌ను మెయింటైన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. వీరు ఇప్పటికి కొన్నిసార్లు మీడియా కళ్ళకు చిక్కి ప్రేమలో పడ్డారంటూ వార్తలు కూడా వినిపించాయి. ఆ వార్తలకు తగ్గట్టుగానే ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు. అయితే చైతన్య.. సమంత ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్న రోజునే చైతు శోభితను ఎంగేజ్మెంట్ చేసుకోవడం విశేషం.