ఈ పై ఫోటోలో కృష్ణుడు గెటప్ లో ఉన్న హీరోయిన్ను గుర్తుపట్టారా.. ఈమె ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. మొదట బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ.. తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. కాగా కెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలో ఓ నటుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇది తన సినీ కెరీర్‌ను దెబ్బతీసింది అనడంలో సందేహం లేదు. తర్వాత వీరికి పాప పుట్టడంతో అమ్మడు సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది.
ఇక పర్సనల్ లైఫ్ కోసం కెరీర్‌ను త్యాగం చేసిన ఆమెకు.. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. మొదట మనస్పర్ధలతో ఈ బ్యూటీ భర్తకు విడాకులు ఇచ్చేసింది. అయితే తర్వాత ఈ అమ్మడి కన్న కూతురు కూడా తనను విడిచి వెళ్ళిపోయింది. దీంతో మళ్ళీ సినిమాలే ఆమెకు లైఫ్ ఇచ్చాయి. మరోసారి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి నటనతో తన సత్తా చాటుకుంది. ఈ క్రమంలో వరుసగా స్టార్ హీరోలు సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. కెరీర్ మొదట్లోకంటే సెకండ్ ఇన్నింగ్స్ లోనే ఈమె పేరు మరింత హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం 45 ఏళ్లు వయసు ఉన్న ఈ అమ్మడు కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ తన అందంతో ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఈమె ఎవరో చెప్పలేదు కదా.. మంజు వారియర్.
వెట్టయాన్‌లో మనసిలాయో అంటూ సందడి చేసిన మంజు వారియర్ హీరోయిన్ గా చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఈమె ఓ మంచి రచయిత కూడా. శాస్త్రీయ నృత్యంలోనూ మంచి ప్రావీణ్యత ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. అయితే గతంలో మంజు పలు సందర్భాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే స్టేజ్షోలతోనూ సందడి చేసింది. అలా స్టేజ్షో ఇస్తున్న క్రమంలో దిగిన ఫోటోనే ఈ పైన కనిపిస్తున్న కృష్ణుడి గెటప్. ఒక కార్యక్రమంలో భాగంగా కృష్ణుని గెటప్ లో కనిపించి అందరిని సర్ప్రైజ్ చేసింది మంజూ. ఇక రచయితగా, శాస్త్రీయ నృత్యకారునిగా, నటిగానే కాదు గాయనిగాను తన సత్తా చాటుకుంది. ఈ క్రమంలో అమ్మడు మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా మంచి ఇమేజ్ సాధించి జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.