సిటాడల్ ట్రైలర్.. స్టార్ హీరోల్ని మించిపోయిన సమంత యాక్షన్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నుంచి ఓ సినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది. చివరగా ఖుషి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. అనారోగ్య కారణాలతో నటనకు బ్రేక్ ఇచ్చేసింది. చాలా కాలం నుంచి కొత్త మూవీస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇంకా గతంలో సమంత నటించిన ఫ్యామిలీమెన్ సిరీస్ దర్శకులు.. రూపొందిస్తున్న సిటాడెల్‌.. హనీబనీ పేరుతో తెర‌కెక్కుతుంది. ఇందులో సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావ‌న్‌తో కలిసి నటించింది.

Citadel: Honey Bunny' trailer: Varun and Samantha tease high-octane spy  thriller - The Statesman

ఇక తాజాగా ఈ సిరీస్‌ రిలీజైంది. ట్రైలర్ చూసిన వాళ్ళకి ఇప్ప‌టికే సినిమా ఫుల్ ఆఫ్ యాక్షన్స్ తో ఉంటుందని క్లారిటీ వచ్చేస్తుంది. ఇక సిరీస్‌లో సమంత సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనుంది. ఈమెకు ఓ కూతురు కూడా ఉంది. మరోవైపు వరుణ్ కూడా సీక్రెట్ ఏజెంట్గా చేస్తూ ఉంటారు. ఇక వీళ్లిద్దరి మధ్య ఎలా పరిచయం ఏర్పడింది.. వీరిద్దరూ కంప్లీట్ చేసిన మెషన్ ఏంటి.. అనేది కథ‌ అని క్లారిటీ ఇచ్చారు మేక‌ర్స్‌. ఇక ట్రైలర్‌లోనే సమంత యాక్షన్ డెమో చూపించేశారు.

Samantha Dazzles in Action-Packed Teaser for `Citadel: Honey Bunny` Ahead  of November Release

గన్ ఫైరింగ్, ఫైటింగ్ ఇలా అన్నిటిలోనూ తన పర్ఫామెన్స్‌తో స్టార్ హీరోల యాక్ష‌న్ సీన్ మించిపోయే రేంజ్‌లో అదరగొట్టింది. ఇక నవంబర్ 7 నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్ హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సిరీస్‌ను రిలీజ్ చేయనన్నారు. ఈ క్ర‌మంలో ట్రైలర్‌తోనే ఆడియన్స్‌లో సమంత మంచి బజ్‌ క్రియేట్ చేసుకోగలిగితే.. ఈ సిరీస్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇక సమంత కొత్త సిరీస్ ట్రైలర్‌ను మీరు కూడా ఒకసారి చూసేయండి.