సినీ ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరో, హీరోయిన్లు ఉన్నా.. స్టార్ నటులు ఉన్నా.. స్టార్ కమెడియన్స్ ఉన్నా.. వారందరిలో బ్రహ్మానందం ఇమేజె వేరు. కామెడీ బ్రహ్మీ బ్రహ్మానందంగా లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న బ్రహ్మానందం.. తెరపై కనిపిస్తే చాలు ఆటోమేటిక్గా ఆడియన్స్ ముఖాలలో నవ్వు చిగురిస్తుంది. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో అయినా బ్రహ్మానందం ఉంటే ఆ సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడుతుంది. సినిమాలోనే కాదు.. బయట కూడా ఆయన బిహేవియర్ చాలా బాగుంటుందని.. ఎంత గౌరవంగా అందరితో మాట్లాడతారని.. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా బ్రహ్మానందంకి అవకాశాలు ఇవ్వడానికి ఇష్టపడతారని టాక్ ఉంది.
దానికి తగ్గట్టుగానే బ్రహ్మానందం తన పేరున నిలబెట్టుకుంటూ ఉంటాడు. ఎలాంటి షార్ట్ అయినా ఒకటేక్లో చేసి చూపించగల సత్తా ఉన్న బ్రహ్మీ.. తన నటనతో ఆడియన్స్ను కడుపుబ్బ నవ్విస్తాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సైతం బెరుకు లేకుండా తన సనివేశాని రక్తికట్టిస్తారు. ఇక బ్రహ్మానందం ఎక్కడ ఉంటే అక్కడ సరదా వాతావరణం ఉంటుందని.. హీరోయిన్స్, హీరోలతో సరదాగా పంచులు వేస్తూ జోకులు వేస్తూ సినిమాల్లోనే కాదు.. బయట కూడా అందరిని నవ్విస్తూ ఉంటాడని సన్నిహితులు చెప్తారు.
అయితే బ్రహ్మానందం కొన్ని సందర్భాల్లో తమతో నటిస్తున్న స్టార్ హీరోయిన్లను ఇమిటేట్ చేస్తూ జోక్స్ వేసి నవ్వించేందుకు ప్రయత్నిస్తాడట. అయితే వారికి అవి అస్సలు నచ్చవు. మాపై జోక్స్ వెయ్యోద్దు అని చెప్పినా బ్రహ్మానందం కూడా లైట్ తీసుకుని.. మళ్ళీ మళ్ళీ చుట్టూ ఉన్నవారిని ఎంటర్టైన్ చేసేందుకు అదే పనులు చేస్తూ ఉంటారట. అలా ఇప్పటికే ఎంతోమంది ముంబై హీరోయిన్స్ బ్రహ్మానందం వేసే పంచులు అస్సలు నచ్చలేదని ఆయనకే ముఖంపై చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయట. కానీ బ్రహ్మానందం వాటిని లైక్ తీసుకుంటాడట. సినిమాల్లో ఎంతమందిని ఎంటర్టైన్ చేస్తాం. మనం సెట్లో ఎంటర్టైన్ అవ్వడానికి చేసే చిన్ని చిన్ని పనులలో విమర్శలు వచ్చిన పెద్దగా పట్టించుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయన అలా ఉంటారట.