నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్టుగా తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న ఈ షో.. బాలయ్య పండుగ అనే సరికొత్త ట్యాగ్‌తో 4 సీజన్ ప్రారంభమైంది. ఇక ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన ఈ ఎపిసోడ్.. మరి కొద్ది క్షణాల్లో డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ఎపిసోడ్ కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ అస్డేట్స్ నెటింట వైరల్‌గా మారాయి.
ఇటీవల బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్తానని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎపిసోడ్‌లో తన యాభై ఏళ్ల ప్రస్థానంలో తనకు నచ్చిన పాత్రల గురించి.. సినిమాల గురించి బాలయ్య చంద్రబాబుతో షేర్ చేసుకున్నారని.. ఇంకా బాలయ్య మేనరిజాన్ని కూడా ప్రదర్శించినట్లు టాక్. రాజకీయం నుంచి బయటకు వచ్చి బాలయ్య, చంద్రబాబు కలిసి ఎన్నో విషయాలను సరదాగా మాట్లాడుకున్నారట. అందరిని ఆకట్టుకోవడం గ్యారెంటీ అని టాక్ నడుస్తుంది. వీరిద్దరి కోసం ఎన్నో ఫన్నీ గేమ్స్ ని కూడా ప్లాన్ చేసినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది.
దీంతో ఫుల్ ఎపిసోడ్ నవ్వులు పోయించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రూ.500 బడ్జెట్ తో కిరాణా షాపింగ్ చేయమని బాబుకు.. బాలయ్య ఇచ్చిన టాస్క్ ఇదే తరహాలో మరిన్ని ఆసక్తికరమైన గేమ్స్ ఉన్నాయట. తన తరహాలో తొడకొట్టాలని.. లేదంటే జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజం చేసి చూపించాలని బాలయ్య షోలో అడిగినట్టు.. దీంతో చంద్రబాబు ఎవరిలా మేనరిజంతో చూపించాడు.. ఎపిసోడ్‌లో తెలియనుంది. ఇక బాలయ్య ప్రశ్నించిన ఎన్నో క్వశ్చన్స్‌కు చంద్రబాబు చెప్పిన సమాధానాలు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తాయని టాక్ నడుస్తుంది. మొత్తానికి ఈరోజు రాత్రి 8:30 నిమిషాలకు మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానున్న క్రమంలో అభిమానులు.. నెటిజన్లు సహా ఎంతోమంది ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు.