కాస్టింగ్ కౌచ్ పై అనన్య నాగళ్ళ షాకింగ్ రియాక్షన్..

టాలీవుడ్ పాపులర్ బ్యూటీ అనన్యనాగళ్ళ‌ ప్రస్తుతం పొట్టేలు సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో సినిమాను అక్టోబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే పొట్టేలు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ నేప‌ధ్యంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు అన‌న్య ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పుకొచ్చింది. అయితే ఓ రిపోర్టర్ ఇతర రంగాల్లో క్యాస్టింగ్ సమస్యలు ఉన్నా.. శని రంగంలో క్యాస్టింగ్ కౌచ్ గురించే ఎందుకు హైలెట్ చేస్తున్నారని.. కొందరు నటీనటులు ప్రశ్నిస్తున్నారు.

క్యాస్టింగ్ కౌచ్ పై అనన్య నాగళ్ల కామెంట్స్ Ananya Nagalla Respond to  Casting Couch Questions

కానీ ఇతర రంగాలలో కాదు సినీ రంగంలో హీరోయిన్గా అవకాశం ఇచ్చే ముందే కమిట్మెంట్ అడుగుతారని టాక్‌.. దానిపై మీ రియాక్షన్ ఏంటి అంటూ ప్రశ్నించింది. దీంతో అనన్య నాగళ‌ రియాక్ట్ అవుతూ సినీ ఇండస్ట్రీలో ఆఫర్లు ఇచ్చే ముందు కమిట్మెంట్ అడుగుతారు అనేది నిజం కాదు. అలాగే తను ఎప్పుడు క్యాస్టింగ్ కౌచ్ సమస్యల్ని ఎదుర్కోలేదు అంటూ సమాధానాన్ని చెప్పుకొచ్చింది.

Ananya Nagalla Strong Answer About Casting Couch | Pottel Trailer Launch |  Noel Sean | Ajay | TFN - YouTube

ఇదే రిపోర్టర్ మరో ప్రశ్నను సంధిస్తూ.. సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇచ్చిన హీరోయిన్లకు ఒక రెమ్యునరేషన్.. కమిట్మెంట్ ఇవ్వని వాళ్ళకి మరో రెమ్యూనరేషన్ ఉంటుందని వార్తలు కూడా ఉన్నాయి. దానిపై మీరు ఏం చెప్తారు అని అడిగింది. మరోసారి రిపోర్టర్‌కు షాక్ తగిలేలా సమాధానం చెప్పింది. ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియకుండా ఎవరో చెప్పిన మాటలు విని కామెంట్స్ చేయడం సరికాదని.. ఇక్కడ ఎవరి టాలెంట్ ని బట్టి వారికి రెమ్యునరేషన్ ఉంటుంది తప్ప.. కమిట్మెంట్‌ని బట్టి కాదు.. అంటూ వెల్లడించింది. ప్రస్తుతం అనన్య నాగళ్ళ కాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.