బాలయ్యతో ఐశ్వర్య.. సోషల్ మీడియాను బ్లాస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 4 లేటెస్ట్ ప్రోమో..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బికె ఏ రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకుందో.. ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. ఈ టాక్‌షోతో ఆడియన్స్ బాలయ్య ల్లో సరికొత్త కోణాన్ని చూసారు. ఎప్పుడు కోపంగా కనిపించే బాలయ్యలో ఉన్న ఫన్నీ యాంగిల్ ఈ షో ద్వారా బయటపడింది. ఇక ఎంత పెద్ద డైలాగ్ నైనా గుక్క తిప్పుకోకుండా చెప్పేసే బాలయ్య.. ఎన్నో పబ్లిక్ ఈవెంట్లలో స్టేజ్ పై మాట్లాడుతూ తడబడిన సందర్భాలు ఉన్నాయి. వీటితో బాలయ్య ఎన్నో ట్రోల్స్ ను కూడా ఎదుర్కొన్నాడు.

అన్ స్టాపబుల్ సీజన్ 3లో మొదటి గెస్ట్ ఎవరంటే..? – News18 తెలుగు

అలాంటి బాలయ్య ఒక షోకు హోస్ట్గా వ్యవహరిస్తే ఇలా ఉంటుందా..? ఇంత అద్భుతంగా చేయగలడా అని స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయే రేంజ్ లో షోను సక్సెస్ చేశాడు. అలా ఇప్పటివరకు ఈ సినిమా మూడు సీజన్లను పూర్తి చేసుకున్న బాల‌య్య‌ ఇప్పుడు తాజాగా నాలుగో సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. దీంతో తాజాగా ఈ సీజన్ లేటెస్ట్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. దసరా పండుగకు ఈ ప్రోమో వీడియో రిలీజ్ అయి.. నెటింట‌ సందడి చేస్తుంది. ఈనెల 24 నుంచి అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రారంభం కానుంది. అయితే మొదటి ఎపిసోడ్‌కు ఐకాన్ సార్ అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్‌గా రానున్నాడు. ఇటీవల ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయిందట.

Unstoppable Season 4 Trailer Review | cinejosh.com

త్వరలో ప్రోమోన్ కూడా లిస్ట్ చేయనున్నట్లు టాక్. ఇక రెండో ఎపిసోడ్ కూడా త్వరలోనే ప్రారంభించనున్నారని.. ఈ సెకండ్ ఎపిసోడ్ కోసం మిస్ ఇండియన్ బ్యూటీ ఐశ్వర్య హాజరు కానుందని స‌మాచారం. కాగా ఇప్పట్లో ఐశ్వర్య నుంచి ఏ సినిమా రిలీజ్ లేదు. అయినా ఐశ్వర్యనే స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. ఇక ఐశ్వర్యతో.. బాలయ్య ఇప్పటివరకు కనీసం ఒక స్పెషల్ సాంగ్ లో కానీ.. కలిసి నటించడం కానీ చేయలేదు. కానీ.. బాలయ్య‌ అనగానే ఆమె వెంటనే డేట్స్ ఇచ్చేసిందట. ఐశ్వర్య ఇప్పటివరకు ఒక టాలీవుడ్ టాక్ షోలో కానీ.. ఇంటర్వ్యూలో కానీ కనిపించింది లేదు. మొట్టమొదటిసారి బాలయ్య అన్‌స్టాపబుల్‌తో టాలీవుడ్ ప్రేక్షకులతో ముచ్చటించ‌నుంది ఐశ్వర్య. ఇక ఈ టాప్ షోలోనే ఇటీవల ఆమెపై వస్తున్న డివోస్ రూమర్స్ కూడా సమాధానాలు దొరికే ఛాన్స్ ఉంది. అంతేకాదు లైవ్ లో అమితాబచ్చన్ కు ఫోన్ చేసి మాట్లాడించే ప్రోగ్రాం కూడా డిజైన్ చేశారట‌. దీపావళి కానుకగా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందని టాక్.