హోమ్లీ బ్యూటీ సౌందర్య నాభి అందాలు చూపించడానికి కారణం అ స్టార్ హీరోయిన్ ఆ.. తనపై కోపంతోనే అలా..

అలనాటి దివంగత నటి.. అందాలతార సౌంద‌ర్య‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి లక్షలాది మంది అభిమానులు సౌందర్యను ఆరాధ్య దేవతగా భావిస్తారు. అంతలా ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. కేవలం హోమ్లీ పాత్రలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. గ్లామర్ రోల్స్‌, బోల్డ్ రోల్స్ కు దూరంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు 15 ఏళ్ల పాటు ఎంతోమంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నించినా సౌందర్య టాలీవుడ్ ను సింగిల్ హ్యాండ్ తో ఏలేసింది.

అప్పట్లో చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ నుంచి ప్రతి ఒక్కరు తమ సినిమాల్లో సౌందర్యం ఉంటే బాగుంటుందని ఆరాటపడేవారు. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని వారి ఉద్దేశం. రచయితలు కూడా సౌందర్యం దృష్టిలో పెట్టుకునే చాలా కథలు రాసేవారు. హోమ్లీ పాత్రలోనూ ఈ రేంజ్ పాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం కేవలం సౌందర్యకు మాత్రమే చెల్లింది. టాలీవుడ్ అగ్ర హీరోలు చిరు, నాగ్‌తో మొదలై జగపతిబాబు, శ్రీకాంత్, రాజశేఖర్ లాంటి మిడిల్ రేంజ్ హీరోల వరకు దాదాపు అందరితోను నటించి మెప్పించిన సౌందర్య.. కెరీర్ చివర్లో మాత్రం కాస్త గ్లామర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Simran's unseen vintage photos on her birthday | Times of India

ఆ సమయంలో కూడా కెరీర్‌ ఇబ్బందుల్లోకి వెళ్తుందేమో అన్న ఉద్దేశంలోనే సౌందర్య ఇలా చిన్న చిన్న గ్లామర్ షోలు చేసిందని టాక్. చివర్లో సౌందర్య నటించిన పలు సినిమాల్లో నాభి అందాలను చూపిస్తూ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ టైంలో స్టార్ బ్యూటీ సిమ్రాన్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సినిమాలో అవకాశాలు కొట్టేసింది. భారి అవకాశాలు సిమ్రాన్‌కి ద‌క్క‌డం.. సౌందర్య డిమాండ్ తగ్గడంతో కాస్త అందాలు చూపించడం మొదలుపెట్టిందని.. అన్నయ్య, జయం మనదేరా, చూడాలని ఉంది లాంటి సినిమాలకు సౌందర్య గ్లామర్ షో కుర్రాళ్లకు పిచ్చెక్కించేదని అప్పట్లో టాక్. ఏదేమైనా సిమ్రాన్ తన అవకాశాలన్నింటినీ లాగేసుకుంటుందనే కోపంతోనే సౌందర్య ఈ గ్లామర్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. అప్పట్లో వార్త‌లు తెగ వైరల్ అయ్యాయి.