రిలీజ్ కు నెల రోజుల ముందే వసూళ్ళ వేట మొదలెట్టిన దేవర.. యూఎస్ ప్రీ సేల్ బిజినెస్ లెక్కలు ఇవే.. !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. ఆర్‌ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత.. పాన్ ఇండియా లెవెల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆడియన్స్ లో మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన రెండు పాటలు భారీ రెస్పాన్స్ అందుకోవడమే కాదు.. యూట్యూబ్‌లో మోస్ట్ ట్రెండింగ్ గా నిలిచాయి. ఇక తాజాగా ఈ సినిమాలో తారక్ డ్యూయ‌ల్‌రోల్‌ ప్లే చేస్తున్నాడంటూ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇలా వరుసగా క్రేజీ అప్డేట్స్ ఇస్తూ రోజు రోజుకు సినిమాపై మరింత హైప్‌ క్రియేట్ చేస్తున్నారు టీం.

సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా.. ఇంకా 27 రోజుల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. దీంతో ఓవర్సీస్‌లో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. అలా ఓపెనింగ్స్ మొదలయ్యాయో లేదో గంటల్లోనే టికెట్స్ భారీ లెవెల్‌లో అమ్ముడుపోయాయి. కొన్ని థియేటర్లలో అయితే గతంలోనే హౌస్ ఫుల్ బోర్డ్ కూడా పెట్టేసారట. ఇక అడ్వాన్స్ బుకింగ్స్‌లో దేవరకు వస్తున్న రెస్పాన్స్ పై ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. నెలరోజుల ముందు ప్రి సేల్స్ మొదలుపెడితే ఈ రేంజ్ లో బుకింగ్స్ అంటే ఇక సినిమా రిలీజ్ అయి హిట్ టాక్ వస్తే ఇక సినిమాకు కాసుల వర్షం కురుస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక యూఎస్ లో దేవర క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఇప్పటికైనా అర్థమయ్యే ఉంటుంది. ఇదే క్రేజ్ సినిమాపై కొనసాగితే ఫ్రీ సెల్ బిజినెస్ లో దేవర సరికొత్త రికార్డ్‌ క్రియేట్ చేయడంలో సందేహం లేదు.

ఎన్టీఆర్ 'దేవర' సాంగ్‌ అదిరిపోయే HD స్టిల్స్ | Jr NTR And Janhvi Kapoor  Devara 2nd Song | Sakshi

అయితే డల్లాస్ లోని ఎక్స్ట్రా బుకింగ్ ఇలా ఓపెన్ చేసారో లేదో అలా ఫస్ట్ టికెట్ల అమ్ముడుపోయాయి. ఈ క్రమంలో రిలేసుకుని నెల రోజుల ముందే దేవర వసూళ్ల వేట మొదలైపోయింది. ఇక రీసెల్స్‌ బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 19 లోకేషన్లో 52 షోలకు 2,407 టికెట్లు బుక్ అయిపోగా.. మొత్తం అక్కడే 75,727 డాలర్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో దేవర అడ్వాన్స్ బుకింగ్ బిజినెస్‌లోనే 100కే డాలర్ల కొల్లగొట్టినట్లు టాక్. అడ్వాన్స్ బుకింగ్ లో సినీ మార్క్ సినిమాస్ మొదటి స్థానంలో ఉండగా, ఆపిల్ సినిమాస్ తర్వాత స్థానాన్ని దక్కించుకుందట‌. ఇక ప్రీమియర్‌కు 27 రోజుల ముందు ఈ రేంజ్‌లో బుకింగ్ జరిగాయి అంటే.. రిలీజ్ రోజుకి దేవర, బాహుబలి, కేజీఎఫ్ కల్కి లాంటి బ్లాక్ బాస్టర్ రికార్డులను కూడా బ్రేక్ చేయడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు అంచనా.