నందమూరి నటసార్వభౌమ తారకరామారావు.. ఈ పేరు చెప్పగానే తెలుగునాడా పులకరించబోతుంది. తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న రామారావు గారు.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంతో మంది జనానికి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ నటవారసులుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి కొంతమంది స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి ఉన్న క్వాలిటీస్ తన తర్వాతి మూడు తరాల వారసులకు కూడా వచ్చాయంటూ.. ఆ కామన్ క్వాలిటీ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారంటూ ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది.
ఇంతకీ తారక రామారావు నుంచి మిగతా వారికి వచ్చినా ఆ కామన్ క్వాలిటీ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. సీనియర్ ఎన్టీఆర్ కు మొదటినుంచి చాలా దయ, జాలి గుణం ఉన్న వ్యక్తి. అయితే ఆయనకు కోపం కూడా చాలా ఎక్కువ. మరి ముఖ్యంగా ముక్కు మీద కోపం అని ప్రతి చిన్న విషయానికి ఆయనకు కోపం వచ్చేస్తుందని చాలామంది సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇక ఆయన నుంచి ఇదే క్వాలిటీ తన కొడుకు హరికృష్ణ, బాలకృష్ణలకు కూడా వచ్చాయి. వీరిద్దరికీ కూడా కోపం చాలా ఎక్కువ. మంచి మనసు ఎలా చూపిస్తారో.. తప్పులేనప్పుడు ఎవరైనా ఒక మాట అంటే వారి కోపాన్ని కూడా అలాగే చూపిస్తారు. ఇక హరికృష్ణ నుంచి తర్వాత ఇదే క్వాలిటీ జూనియర్ ఎన్టీఆర్కి కూడా వచ్చింది. ఇక గతంలో ఒకానొక స్టేజిపై సుమ వెటకారంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ పై పంచ్‌వేయగా.. ఎన్టీఆర్ స్టేజ్ పైనే సుమపై ఫైర్ అవుతూ కోపంగా చూసిన పిక్స్ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇక అదే క్వాలిటీ ఇప్పుడు ఎన్టీఆర్ కొడుకు అయినా భార్గవ్‌రామ్ కు కూడా వచ్చిందంటూ.. సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. భార్గవ్ రామ్‌కు ఇంత చిన్న వయసులోనే చాలా కోపం ఎక్కువ అట. ఎవరైనా అనవసరంగా ఒక్క మాట అన్నా ఊరుకోడట.. కోపంతో ఊగిపోతాడని.. తండ్రిని మించిన కోపం భార్గవ్ రామ్‌కు ఉందంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వార్తను తెగ ట్రెండ్ చేస్తూ మురిసిపోతున్నారు. అయితే తండ్రి, తాత, ముత్తాత లాగే మా తారక్ అన్న చిన్న కొడుకు కూడా ఇండస్ట్రీలో హీరోగా తన సత్తా చాటుతాడు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.