ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా రాణిస్తున్న వారంతా రోజురోజుకు మరింత గ్లామరస్ గా తయారవుతూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు. చాలామంది స్టార్‌బ్యూటీస్ ఒకప్పటి కంటే మరింత అందంగా మారి గుర్తుపట్టలేనంతగా తమ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. అలా ఈ పై ఫోటోలో ఉన్న టీనేజీ అమ్మాయిల్లో ఓ స్టార్ హీరోయిన్ కూడా ఉంది. ఎవరైనా గెస్ చేయగలిగితే నిజంగా జీనియస్. తన అందంతో దేశాన్ని ఓ ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ.. చూడ చక్కని రూపంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తన డ్యాన్స్ తో ఎవరినైనా తన వైపు తిప్పేసుకుంటుంది. స్టేజిపై ఆమె డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ వస్తే చాలు.. అలా చూస్తూ ఉండిపోతారు.
ఇక ఈ అమ్మడు మన టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోను ఆడి పాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే టీనేజ్ లుక్ కి ఇప్పటికీ అమ్మడి ఫేస్ కట్ లో చాలా మార్పులు వచ్చాయి. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. అది కాస్త కష్టం లేండి.. మేమే చెప్పేస్తాం. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నటి నౌరా ఫతేహి. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ అమ్మడు.. స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. నౌర ఫతేహి ఎక్కడ ఉన్నా అమ్మడి వైబ్స్ నెక్స్ట్ లెవెల్. అయితే ఈ పాత ఫోటోలో ఆమె లక్.. ఇప్పటి లుక్ కి పూర్తి భినంగా ఉంది. నౌర ఫతేహి స్కూల్లో చదువుతున్న సమయంలో దిగిన ఫోటో ఇది.
ఇప్పుడు దీన్ని సోషల్ మీడియాలో అమ్మడు షేర్ చేయడంతో.. క్షణాల్లో ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటో తీసినప్పుడు నౌరా ఫతేహి కేవలం 17 ఏళ్ల టీనేజ్ గర్ల్. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ వయసు 32 ఏళ్ళు.. ఇక దాదాపు 15 ఏళ్ల క్రితం నాటి ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ గా మారింది. ఈ ఫోటోలో ఆమె ఎడమ వైపు నుంచి మొదటి అమ్మాయి. తన పక్కన మిగతా వారంతా ఆమె క్లాస్మేట్స్ అట. ఇక నౌర తెలుగులో ఎన్టీఆర్ తో టెంపర్ మూవీలో ఓ సాంగ్‌కు చిందేసింది. అలాగే ప్రభాస్‌తో బాహుబలి సినిమాలోను ఆకట్టుకుంది.