స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రకుల్.. మొదట కన్నడ ఇండస్ట్రీలో తను నటనతో ఆకట్టుకుంది. తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ లోనూ స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడిపింది. అయితే తర్వాత మెల్లమెల్లగా అవకాశాలు నెమ్మదించడంతో.. బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ కూడా సక్సెస్ అందకపోవడంతో అడుపా దడపా సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్ని నటిస్తుంది.
ఇక ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ సినీ ఇండస్ట్రీలో నెపోటిజం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. రకుల్ మాట్లాడుతూ నెపోటిజం కారణంగా తన సినీ కెరీర్‌లో ఎన్నో అవకాశాలు కోల్పోయానంటూ చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న క్రమంలో కూడా.. నెపోటిజంను నేను ఎదుర్కోవాల్సి వచ్చిందని.. ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది. ఇది జరుగుతూనే ఉంది.. అన్నది వాస్తవం అంటూ చెప్పుకొచ్చింది. ఆ కారణంతోనే నేను ఇప్పటికే ఎన్నో సినిమా అవకాశాలను కోల్పోయాను. అరే అవకాశాలు కోల్పోయాను అని ఎప్పుడూ బాధపడేదాన్ని కాదు.. అలా అని నేను కూర్చుని ఉండిపోయే వ్యక్తిని కూడా కాదు.. బహుశా ఆ సినిమాలు నాకోసం రాసిపెట్టి లేవని ముందుకు వెళ్లిపోయే దాన్ని అంటూ రకుల్ వివరించింది.
నా తండ్రి ఆర్మీలో పనిచేసిన వ్యక్తి కావడంతో.. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్న. దీంతో నేను ఇలాంటి చిన్న విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించను. అవకాశాలు కోల్పోవడం ప్రతి ఒక్కరి జీవితంలో సామాన్యం. అలాంటప్పుడు తప్పని వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయను. ఓ స్టార్ కిడ్‌కు అవకాశాలు రావడం చాలా సులభం. ఆ క్రెడిట్ అంతా వారి తల్లిదండ్రులకే దక్కుతుంది. అయితే కొత్తవారికి అవకాశాలు రావడం చాలా కష్టం. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ వివరించింది. ఇక తెలుగులో రకుల్ నటించిన చివరి సినిమా కొండపాలెం. 2021 లో రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ అందుకోలేకపోయింది. రీసెంట్గా భారతీయుడు 2 లో ఈమె ఓ కీరోల్లో కనిపించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌తో దేదే ప్యార్ దే 2 సినిమాలో నటిస్తోంది. మేరే ప్రత్నికా రీమిక్ సినిమాలోను భారతీయుడు 3 ప్రాజెక్టులోను ఈ అమ్మడు నటించనుంది.