రమ్యకృష్ణ తో ఇప్పటివరకు నాన్న, అన్న, భర్తగా నటించిన ఏకైక యాక్టర్ ఎవరో తెలుసా..?

ఒకపటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ప‌లు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అమ్మగా, అక్కగా, వదినగా ఇలా ఎన్నో పాత్రలో నటిస్తూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి లో శివగామి పాత్రలో నటించి తన సత్తా చాటుకుంది. ప్రపంచవ్యాప్తంగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈమె హీరోయిన్ గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు.. విలన్ పాత్రలోనూ నటించి మెప్పించింది.

Sivagami is the grandest loser in Baahubali

దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఆకట్టుకున్న ఈమెకు.. సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. రమ్యకృష్ణ సినీ కెరీర్లో ఓ సినిమాలో ఆమెకు అన్నయ్యగా నటించిన వ్యక్తి.. మరో సినిమాలో భర్తగా, మరో సినిమాలో తండ్రిగా నటించి మెప్పించాడట. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో.. ఆ సినిమాల లిస్ట్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. ఆ నటుడు ఎవరో కాదు.. బాహుబలి మూవీ లో బిజ్జాల దేవుడిగా కనిపించిన నాజర్.

ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు, తమిళ్ లోను ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక నాజర్, రమ్యకృష్ణ చాలా సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నరసింహ మూవీలో రమ్యకృష్ణకు.. నాజర్ అన్నయ్యగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అత్తారింటికి దారేది తమిళ్ వెర్షన్ మూవీలో నాజర్.. రమ్యకృష్ణకు తండ్రిగా నటించారు. ఇక రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ భర్తగా బీజ్జాలదేవ నటించి అందరిని ఎంటర్టైన్ చేసిన సంగతి తెలిసిందే. అలా ఇప్పటివరకు రమ్యకృష్ణ సినీ కెరీర్‌లో అన్నగా, తండ్రిగా, భర్తగా నటించిన ఏకైక నటుడుగా నాజర్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

Narasimha Movie || Ramya Krishna Became Angry Dailogues