టాలీవుడ్ సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈయన సినిమాల్లోనూ రాజుల ఓ వెలుగు వెలిగారు. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోగా డిఫరెంట్ పాత్రలో మెరుశారు. యాంగ్రీ యంగ్ మెన్ గా, తిరుగుబాటు చేసే వ్యక్తిగా, విలన్‌గా కీలక పాత్రల్లో ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటనతో తన సత్తా చాటుకున్నాడు. రెబల్‌స్టార్‌గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఐదు దశాబ్దాల తన సినీ కెరీర్‌లో రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన ఈయన.. యాక్షన్, ఫ్యామిలీ సినిమాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అదే సమయంలో ఎంతోమంది హీరోయిన్లతోనూ ఆడి, పాడారు. అయినా కృష్ణంరాజు జోడిగా నటించిన హీరోయిన్లు అంటే కేవలం ఇద్దరు ముగ్గురే మైండ్‌లో మెదడుతూ ఉంటారు.
వారిలో మొదట వినిపించేది జయసుధ. రెబల్ స్టార్ మెచ్చిన.. ఆయనకు బాగా నచ్చిన హీరోయిన్ కూడా జయసుధనే అట. ఆమె నటనతో పాటు.. కృష్ణంరాజు జోడిగా నటించిన సినిమాలు అంటే కూడా ఆయనకు బాగా నచ్చుతాయట. అయితే ఆమె అంతగా నచ్చడానికి కారణం ఏంటో కృష్ణంరాజు గతంలో ఓ సందర్భంలో వివరించారు. ఇతర హీరోయిన్లతో నటన అంటే కొంచెం బ్యాలెన్స్ తప్పుతుందని.. సీన్లని పంచుకోవడం విషయంలో జయసుధ నేను అయితే బాగా సహకరించుకుంటాం. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండుతుంది. ఇంటిమేట్ సీన్స్, భార్యాభర్తల పాత్రలు డ్యూయెట్స్ ఇలా ఏదైనా మా ఇద్దరి మధ్యన సన్నివేశాలు సెట్ అవుతాయి అంటూ ఆయన వివరించారు.
మా ఇద్దరి మధ్యన నటన విషయంలో ఓ మంచి అండర్స్టాండింగ్ ఉంటుందని.. అందుకే ఆమెతో 70కి పైగా సినిమాల్లో నటించాను అంటూ చెప్పుకొచ్చారు. కృష్ణంరాజు. దాదాపు 200 సినిమాల్లో నటించిన కృష్ణంరాజు 70 నుంచి 80 సినిమాలలోపు జయసుదతో నటించడం నిజంగానే గొప్ప విషయం. ఇన్ని సినిమాలు వీరిద్దరే జంటగా నటించారంటే ఏ రేంజ్ లో వీరి మధ్యన అండర్స్టాండింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కృష్ణంరాజుకు గ్లామర్ పరంగా నచ్చిన హీరోయిన్ శ్రీదేవి అట.
అందం విషయంలో ఎప్పుడూ ఆ శ్రీదేవిదే పై చేయి అని.. ఆమె అందం తనకు నచ్చుతుందని.. మేమిద్దరం కలిసి ఏడెనిమిది సినిమాల్లో నటించామంటూ వివరించాడు. కేవలం డ్యాన్సులు, కమర్షియల్ హీరోయిన్ అనే యాంగిల్ లోనే ఆమెతో సినిమాల్లో నటించినట్లు వివరించాడు. ఇంటిమేట్ సీన్లు ఉన్న సినిమాలేమీ ఆమెతో నటించలేదని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా కృష్ణంరాజు వర్ధంతి సందర్భంగా కృష్ణంరాజుకు సంబంధించిన ఈ విషయాలు నెటింట వైరల్‌గా మారుతున్నాయి.