సినీ ఇండస్ట్రీలో తమతో పాటు కలిసి నటించిన కో స్టార్స్‌తో ప్రేమలో పడటం. వివాహం చేసుకోవడం. బ్రేకప్ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం మొదట ఏళ్ల తరబడి డేటింగ్ చేసి అన్ని సెట్ అయితేనే వారిని వివాహం చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తమ పార్టనర్‌తో డేటింగ్ చేసి.. గర్భం దాల్చిన తర్వాత వివాహాలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా పెళ్లికి ముందే గర్భం దాల్చిన హీరోయిన్లు ఎవరో..? ఆ లిస్ట్ ఏంటో..? ఒకసారి తెలుసుకుందాం.
శ్రీదేవి:
అతిలోకసుందరి శ్రీదేవికి టాలీవుడ్ లో ఉన్న క్రెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక శ్రీదేవి నిర్మాత బోనికపూర్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేసిన ఈ జంట.. శ్రీదేవి గర్భం దాల్చిన తర్వాత వివాహం చేసుకున్నారు.
ఏమీ జాక్సన్:
స్టార్ హీరోయిన్ ఏమీ జాక్సన్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో ను ఎవడు, అభినేత్రి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ఏమీ జాక్సన్.. మొదట జార్జ్ పన్నాయత్తు అనే వ్యక్తితో కొంతకాలం డేటింగ్ లో ఉంది. అతనితో ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డ పుట్టిన తర్వాత.. అతనికి బ్రేకప్ చెప్పేసి మరో వ్యక్తితో ప్రేమలో పడింది.
నీనా గుప్త
స్టార్ నటి నీనా గుప్త వివాహానికి ముందే.. వినయన్ రీఛార్డ్తో డేటింగ్ చేస్తూ గర్భవతి అయింది.
అమలాపాల్:
టాలీవుడ్ బ్యూటీ అమలాపాల్ తెలుగులోను పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అమ్మడు మొదట ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనితో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్న.. అమలాపాల్ తర్వాత మరో వ్యక్తితో కొంత కాలం డేటింగ్ చేసి గర్భవతి అయిన తర్వాత అతనిని వివాహం చేసుకుంది.
ఇలియానా:
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ అవకాశాలను అందుకుంది. అయితే అక్కడ రావడంతో ఇండస్ట్రీకి దూరమైందా ..ఇలియానా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఇక బిడ్డ పుట్టిన తర్వాత తన భర్తను జనానికి పరిచయం చేసింది.
క్యాబ్రీయెల్లా డెమెట్రియేడ్స్
గతేడాది దసరా కానుకగా రిలీజ్ అయిన బాలయ్య మూవీ భగవంత్ కేసరి సినిమాల్లో విలన్‌గా నటించిన అర్జున్ రాంపాల్ కు పరిచయం అవసరం లేదు. అర్జున్ రాంపాల్ క్యాబ్రీయెల్లా డెమెట్రియేడ్స్ తో డేటింగ్ చేసాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అయితే క్యాబ్రీయెల్లాకు వివాహానికి ముందే ఒక కొడుకు కూడా ఉన్నాడు.