రవితేజ ఇడియట్ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.. మీ కళ్ళను మీరే నమ్మలేరు..!

అలా కొంతమంది ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొంతకాలానికి సినిమాలకు దూరమవుతారు. మరి కొంతమంది కొంత‌కాలం గ్యాప్ తర్వాత త్రో బ్యాక్ ఇచ్చి ఆడియన్స్ కు దగ్గరవుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీకి దూరమైనా చాలామంది హీరోయిన్స్ తమ షేప్‌లు, ఫిట్ నెస్‌ను మాత్రం దూరం చేసుకోకుండా అదే గ్లామర్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీకి దూరమైన తర్వాత తమ గ్లామర్, ఫిట్నెస్ ను కూడా కోల్పోతూ ఉంటారు.

అలాంటి వారిలో మనం ప్రస్తుతం చెప్పుకుంటున్న హీరోయిన్ కూడా ఒకటి. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు గతంలో మహేష్ బాబు ,ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఇడియట్ సినిమాతో అమ్మడికి మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ గా మారింది. అంతేకాదు తమిళ్‌లోను సినిమాలో నటించిన ఈ అమ్మడు విజయ్ దళపతితోను స్క్రీన్ షేర్ చేసుకుంది.

కన్నడలో ఎన్నో హిట్ సినిమాలను త‌న ఖాత‌లో వేసుకున్నా రక్షిత అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైంది. తర్వాత ఇండస్ట్రీకి చెందిన ప్రేమ్‌ అనే వ్యక్తిని 2007లో వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే సినిమాలకు దూరమైన తర్వాత రక్షిత నిర్మాతగా మారి.. పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. అలాగే పలు టీవీ షో లోను సందడి చేసింది. ప్రస్తుతం బుల్లితెర రియాల్టీ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తున్న రక్షిత.. లేటెస్ట్ ఫోటోస్ వైర‌ల్‌ అవడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. వామ్మో ఇడియట్ మూవీ హీరోయిన్ ఏంటి.. ఇంతలా మారిపోయింది. అసలు మా కళ్ళను మేమే నమ్మలేకపోతున్నాం. ఈమె రక్షిత నేనా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.