సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం అన్న సంగతి తెలిసిందే. ఇక్కడ డబ్బే ప్రపంచంగా చాలా మంది శ్రమిస్తూ ఉంటారు. డబ్బిస్తే ఎలాంటి పాత్రలో అయినా.. ఏ పాత్రైనా.. ఎలాంటి పనైనా చేసేవారు లేకపోలేదు. అయితే డబ్బే కాదు విలువలతో కూడిన అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ సినిమాల్లో నటించేవారు కూడా ఉన్నారు. ప్రతి రూపాయి తమ కష్టంతో కూడబెట్టినది కావాలని.. అంతేకాదు కష్టాన్ని ఇష్టంగా చేయాలని భావించేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. అలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ కోట్ల రెమ్యూనరేషన్ కుమ్మరిస్తామన్న తమకు నచ్చని పనిని చేయని స్టార్ హీరోలు ఉన్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరో.. వాళ్ళకి నచ్చని ఆ పనులు ఏంటో ఒకసారి చూద్దాం.
మహేష్ బాబు :
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు.. దశాబ్దాల నుంచి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. కాగా ఏళ్ల తరబడి కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామంటూ బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నా.. వాటిని రిజక్ట్ చేస్తున్నాడు. తెలుగు సినిమాలు వదిలేసి.. ఎన్ని కోట్లు ఇచ్చిన హిందీలో సినిమాలు నటించే ప్రసక్తే లేదంటూ.. తెల్చి చెప్పేస్తున్నారట మహేష్. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది కదా అని సందేహం మీకు రావచ్చు.. అయితే ఈ సినిమా తెలుగు నేపథ్యంలోనే పూర్తి నిర్మాణం జరుగుతుంది.
ప్రభాస్ :
బాహుబలి తర్వాత పాన్ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతున్న ప్రభాస్‌కు నేషనల్ వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఎన్నో బ్రాండ్స్‌కు వందల కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామంటూ.. ఆఫర్స్ వస్తున్నాయట. అయినా ప్రభాస్ వాటిని ఒప్పుకోలేదు. ప్రభాస్ మొదటి నుంచి బ్రాండ్ ప్రమోషన్స్ ను అస్సలు ఎంకరేజ్ చేయరు.
జూనియర్ ఎన్టీఆర్ :
నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాత పోలికలు వచ్చిన మనవడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. ఈ క్రమంలో చాలా సార్లు సీనియర్ ఎన్టీఆర్ పాత్రను పోషించే ఆఫర్లు ఎన్టీఆర్‌కు వచ్చినా.. తాను అందుకు అర్హుడిని కాదంటూ కోట్ల రెమ్యూనరేషన్ కూడా రిజెక్ట్ చేశాడట తారక్.
శోభన్ బాబు :
ఒకప్పటి టాలీవుడ్ అందగాడు ఎంతోమంది అమ్మాయిల హృదయాలను గెలుచుకున్న శోభన్ బాబు.. చచ్చే వరకు హీరోగానే ఉండాలని ఫిక్స్ అయ్యారట. అందుకే చివరి వరకు ఎన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్ల అవకాశాలు వచ్చినా.. ఎంత డబ్బు రెమ్యూనరేషన్‌గా ఇస్తామన్నా నో చెప్పేశారట. తర్వాత వయస్సు రిత్యా సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసిన శోభన్ బాబు.. అలాంటి సందర్భంలో కూడా సైడ్ క్యారెక్టర్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.