ఎప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉండే తారక్‌కు ఆ విషయంలో అంత భయమా.. అందుకే రిస్క్ చేయలేదా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాన్ అఫ్ మాసస్‌గా ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు తెలిసిందే. చివరిగా ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్.. ఈ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్నాడు తారక్. ఈ సినిమా షూటింగ్ 90% ముగిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఎన్టీఆర్ దర్శకులకు ఫ్లాప్ ఉన్న వారి ప్రతిభను నమ్మి అవకాశాలు ఇస్తాడు. అలా ఇప్పటికే ఎన్నోసార్లు సక్సెస్ అందుకున్నాడు. అంతేకాదు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండే తారక్.. ఎందుకో వారితో సినిమాలు తీసే విష‌యంలో మాత్రం రిస్క్ చేయ‌రు.

స్వామిరారా లాంటి క్రైమ్ కామెడీ మూవీ తో సుధీర్ వర్మ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. నిఖిల్, కలర్ స్వాతి నటించిన ఈ సినిమా 2003లో రిలీజై సర్ప్రైజింగ్ హిట్ అందుకుంది. స్టార్స్ లేకుండా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో సుధీర్ వర్మ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. ఆయన ప్రతిభ‌కు తారక్ కూడా ఫిదా అయ్యాడు. అయితే ఆ సమయంలో సుధీర్ ఓ కథను ఎన్టీఆర్‌కు వినిపించాడని.. వీరి కాంబినేషన్ల సినిమా రానుందని వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. కానీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. తర్వాత 2016లో రిలీజ్ అయిన పెళ్లిచూపులు సినిమా ఎలాంటి విజ‌యం ద‌క్కించుకుందోతెలిసిందే. విజయ్ దేవరకొండ, రీతు వర్మ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. అయితే తరుణ్ భాస్కర్ ఇప్పటివరకు తెర‌కెక్కించిన సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంటున్నాడు.

ఆ విషయంలో భయపడుతున్న ఎన్టీఆర్.. అలా చేస్తే రిస్క్ చేసినట్టే అని  ఫీలవుతున్నారా

కాగా వీరి మధ్యలో కూడా ఓ సినిమా కాన్వర్జేషన్ జరిగిందని.. తారక్, తరుణ్ భాస్కర్ కంబోలో సినిమా రాబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. ఇది కూడా పట్టాలెక్కలేదు. ఇప్పుడు యువ డైరెక్టర్ హాయ్ నాన్నతో నాన్నకి హిట్ ఇచ్చిన శౌర్యవ్‌తో తారక్ సినిమా తీస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఆ ప్రచారం వాస్తవమ‌ని సన్నిహిత వర్గాల సమాచారం. శౌర్య‌వ్‌.. తార‌క్‌కు ఓ కథ చెప్పాడట. ఆ కథతో ఎన్టీఆర్ ఇంప్రెస్ అయినా.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వలేదట. ఈ క్రమంలో సుధీర్ వర్మ, తరుణ్ భాస్కర్ల సినిమాల తరహాలోనే ఇది కూడా కేవలం వార్తలకు మాత్రమే పరిమితం అవుతుందని సెట్స్‌ పైకి వచ్చే అవకాశాలు లేదంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేసే ఎన్టీఆర్.. వారితో సినిమాలు చేయడానికి మాత్రం భయపడుతున్నాడని.. అందుకే ఇప్పటివరకు అలాంటి రిస్క్‌ చేయలేదంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.