నందమూరి నటసింహం బాలకృష్ణ.. బాబీ డైరెక్షన్‌లో తన 109వ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక NBK 109 రనింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారంటూ వార్తలు నెటింట తగ్గ వైరల్‌గా మారుతున్నాయి. ఈ వార్తలు నిజమేనంటటూ ఫిలింనగర్ వర్గాలు, యూనిట్ సన్నిహితుల నుంచి కూడా టాక్ వినిపిస్తుంది. అభిమానులందరికీ నచ్చేలా టైటిల్ ఫిక్స్ చేయాలనే ఉద్దేశంతో బాబి ఒక మాస్ టైటిల్ అనుకుంటున్నాడట. ఇక బాలకృష్ణను తన స్నేహితులు బాలా అని.. అభిమానులు ముద్దుగా బాలయ్య బాబు అని పిలుచుకుంటూ ఉంటారు. గతంలో నందమూరి నాటసింహం అనే ట్యాగ్ ఇచ్చిన జనం.. ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసేస్ అని పిలుచుకుంటున్నారు.
ఇలా బాలయ్యను గర్వంగా పిలుచుకుంటున్న అభిమానుల పల్స్ పట్టేసిన బాబి.. తన కొత్త టైటిల్ అదే రేంజ్ లో ఫిక్స్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను ” వీర మాస్ ” అని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అభిమానులకు కూడా ఈ టైటిల్ కచ్చితంగా నచ్చుతుందని మూవీ టీం కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. అయితే ఈ టైటిల్ పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. వీరా అనేది బాలకృష్ణతో పాటు, బాబీకి కూడా కలిసి వచ్చిన పదం కావడంతో ఇప్పుడు.. వీళిద్దరూ చేస్తున్న ఈ సినిమా టైటిల్‌లో ఖచ్చితంగా వీరా ఉండేలా ఇలా ఫిక్స్ చేశారని సమాచారం.
శ్రీకర స్టూడియోస్ ప్రొడక్షన్‌లో.. సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు గ్లింప్స్ రిలీజై ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. అలాగే ప్రస్తుతం బాలయ్య వరుస హ్యాట్రిక్ సక్సెస్ లతో దూసుకుపోతున్న క్రమంలో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తుందా అంటూ అభిమానులంతా వెయ్యికళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.