ఏంటి.. జగన్ ఓటమికి రాజమౌళి కారణమా.. ఇదెక్కడి ట్విస్ట్ రా స్వామి..?

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన జక్కన్న.. తర్వాత రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును అందుకొని ఆఖ్యాతిని రెట్టింపు చేశాడు. కెరీర్ స్టార్టింగ్‌ నుంచి ఇప్పటివరకు ప్లాప్ అన్నదే లేని నెంబర్ వన్ స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. ఇలాంటి క్రమంలో రాజమౌళికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అదేంటో కాదు మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోవటానికి రాజమౌళి కూడా కారణమే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం తాజాగా ఓ టీవీ ఛానల్ కి సంబంధించిన యాంకర్ తన విశ్లేషన్‌లో చెసిన కామెంట్సే వైర‌ల్‌గా మారాయి.

ఆయన మాట్లాడుతూ జగన్ ఓడిపోవటానికి గల కారణాలలో రాజమౌళి కూడా ఒకడు అంటూ వివరించాడు. రాజమౌళికి.. జగన్ ఓటమికి.. సంబంధం ఏంటా అనే సందేహం మీలో కలగవచ్చు. అసలు మ్యాటర్ ఏంటంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన మాటల మధ్యలో రాజమౌళి ఎవరో నాకు తెలియదు.. డైరెక్టర్ అని అంత అంటున్నారు. ఏ సినిమాలు తీశాడు అన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడట. ఈ విషయాన్ని యాంకర్ వివరిస్తూ ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలుసు. ఈ విషయం వారందరిని కచ్చితంగా హర్ట్ చేస్తుంది అంటూ కామెంట్స్‌ చేశాడు. దీంతో ఇప్పుడు ఆ యాంకర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

ఈ క్రమంలో అంతా గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ జగన్ దగ్గరికి సినీ సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి నేతృత్వంలో మహేష్ బాబు, నాగార్జున, ప్రభాస్, రాజమౌళి కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో రాజమౌళి ఎవరో కూడా తెలియదని జగన్ అన్నాడని.. చిరంజీవి లాంటి సినీ పెద్ద నమస్కారం చేస్తే తిరిగి నమస్కారం కూడా చేయకుండా అలా ఉండిపోయాడని.. ఆహంకారం, గర్వమే జగన్ ఓటమికి కారణమైంది అంటూ నెటిజ‌న్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది జగన్‌కు పోయేకాలం కాకపోతే.. రాజమౌళి తెలియదంటూ ఎందుకు ఈ చెత్త కామెంట్స్, చిరుని చూసి కనీసం తిరిగి నమస్కారం చేయకుండా వెటకారంగా నవ్వుతాడా అంటూ ఫైర్ అవుతున్నారు.