వాట్.. చిరంజీవి ఇచ్చిన ఆ చెత్త సలహావల్లే స్యామ్ – చైతు విడిపోయారా.. షాకింగ్ సీక్రెట్ రివీల్..!

టాలీవుడు స్టార్ హీరోయిన్‌ సమంత, హీరో నాగచైతన్యకు ప్రేక్ష‌కుల‌లో ప్ర‌త్యేక పరిచయం అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాలో జంటగా నటించిన సంగ‌తి తెలిసిందే.. ఈ సినిమా షూట్ టైంలో ఒకరితో ఒకరు ప్రేమలో పడిన ఈ జంట.. కొనెళ్ళ రాహ‌స్య‌ ప్రేమాయ‌ణం తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కారు. టాలీవుడ్ లోనే మోస్ట్ ఫేవరెట్ కపుల్ గా ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకున్నారు. పెళ్లి తర్వాత ఎంతో హ్యాపీగా ఉన్న ఈ జంట.. కొంత‌కాలానికి గొడవలు కారణంగా విడాకులు తీసుకున్ని ఫ్యాన్స్‌కు స‌డ‌న్ షాక్ ఇచ్చారు. ఇద్దరు కూడా ఇష్టంగా విడాకులు తీసుకున్నట్లు తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వివరించారు. ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. అయితే ఈ జంట ఎందుకు విడాకులు తీసుకున్నారు..? అనే దానిపై మాత్రం ఒక్కరు కూడా స్పందించలేదు.

Samantha Akkineni and Naga Chaitanya's Marriage in Trouble? The Actress  Reacts - News18

దీంతో సమంత తప్పు చేయడం వల్ల చైతన్య విడాకులు ఇచ్చాడంటూ.. లేదు చైతన్య కారణంగానే విసిగిపోయి సమంత అతనికి విడాకులు ఇచ్చిందంటూ.. అమలా కారణంగానే సమంత, చైతన్య మధ్య గొడవలు జరిగాయని.. ఆమె బిహేవియర్ వల్లే వీరిద్దరూ విడిపోవాల్సి వచ్చిందని.. ఇలా ఎన్నో రకాల వార్తలు నెటింట‌ వైరల్ అయ్యాయి. ఇప్పటికి వీరిద్దరికి విడాకులకు సంబంధించి ఎన్నో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరి విడాకులకు చిరంజీవి ఇచ్చిన ఓ సలహానే కారణమంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. చైతు – స్యామ్ వివాహం తర్వాత రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో సమంత హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సమంతను హీరోయిన్గా పెట్టుకుందామా.. లేదా.. అని సుకుమార్ చాలా ఆలోచన చేశాడట.

Samantha says Swayamkrushi is for Chiranjeevi, Rangasthalam is for Charan

ఈ విషయాన్ని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లగా.. చిరు ఆ పాత్ర నచ్చితే ఆమె ఓకే చెబుతుంది. లేదంటే నో చెప్తుంది. ఓసారి అడిగి చూడండి తప్పేం లేదు కదా.. అని సలహా ఇచ్చాడట. దీంతో వెంటనే సుకుమార్.. సమంతను కలిసి ఆమె పాత్ర గురించి వివరించగా ఆమె గ్రీన్ సిగ్నల్చిందట. ఆ తర్వాత సినిమా సూపర్ సక్సెస్ కావడం స్యామ్‌కు మంచి పేరు రావడంతో సమంతకు నటనపై ఆసక్తి మరింతగా పెరిగిందట. ఆ అత్యుత్సాహంతోనే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఈ వెబ్ సిరీస్ కారణంగానే వీరిద్దరి మధ్యలో మనస్పర్ధలు చోటుచేసుకున్నాయంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సిరీస్ తర్వాత చైతన్య, సమంత ఒకరితో ఒకరు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో సమంత, చైతన్య విడాకులకు పరోక్షంగా చిరంజీవి.. సుకుమార్ కు ఇచ్చిన సజెషనే కారణమంటూ.. ఇన్నాళ్లకు ఈ విషయం బయటకు వచ్చిందంటూ.. చిరంజీవిని తప్పు పడుతూ వార్తలు వైరల్ చేస్తున్నారు మెగా హెటర్స్.