నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎప్పటి నుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ కచ్చితంగా ఉండనుందని క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా కు ప్రశాంత్ వర్మ అయితేనే పర్ఫెక్ట్ డైరెక్టర్ అంటూ జనం కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా నిర్మాత ఎవరు.. అనే ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకుల మొదలైంది.
ఈ క్రమంలో ఈ సినిమాకు బాలయ్య స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక బాలయ్యే నిర్మాతగా వ్యవహరిస్తే మాత్రం కచ్చితంగా బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గరన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సెట్స్ పైకి త్వరలోనే రానుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ వర్మ చెప్పిన కథకు ఇప్పటికే బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని.. ప్రశాంత్ వర్మ ఈ సినిమాను రూ.100 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందించాలని ప్లాన్ చేశాడని.. 2024 సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టిన రోజు భాగంగా ఈ ఫస్ట్ మూవీ అనౌన్స్మెంట్ అఫీషియల్ గా రానుందని సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ఇక మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజముందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్న తర్వాత.. బాలయ్య, మోక్షజ్ఞ కాంబోలో మల్టీస్టరర్ సినిమా వస్తే బాగుంటుందని.. తండ్రి, కొడుకులని ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూడాలని ఆశపడుతున్నారు అభిమానులు. ఇక మోక్షజ్ఞ విషయానికొస్తే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో తన సినిమాలతో మోక్షజ్ఞ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి.