టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న క్రేజ్ గురించి.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అవసరం లేదు. అయితే ఈమె సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే పలు పోస్టులు షేర్ చేస్తూ ఉండే ప్రణతి.. సోషల్ మీడియాను చాలా రేర్‌గా వాడుతూ ఉంటుంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే స్టార్ హీరోల భార్యల్లో మొదటి స్థానం లక్ష్మీ ప్రణతికి దక్కుతుంది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ తన భార్య విషయంలో ఎంతో ప్రేమగా ఉంటారు. ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ తన భార్య గురించి ఎన్నో ఆసక్తికర విషయాన్ని షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటాడు. ఈ క్రమంలో తన భార్యకు తన మొదటి ప్రిఫరెన్స్ ఇస్తానని.. తర్వాతే క్రికెట్కు ప్రిఫరెన్స్ ఉంటుందని ఎన్టీఆర్ వివరించాడు. గతంలో నేచురల్ స్టార్ నాని నటించిన ఓ సినిమా రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన గెస్ట్ గా పాల్గొని సందడి చేశాడు. ఇందులో భాగంగా భార్య లక్ష్మి ప్రణతి గురించి మాట్లాడుతూ.. లక్ష్మీ ప్రాణతి ఎక్కువగా ఇష్టపడే సినిమా ఏంటో కూడా రివీల్ చేశాడు. ఈ జనరేషన్లో సాహజనటనతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నాని ఒకరని.. ఆయన నటించిన పిల్ల జమిందార్ సినిమా అంటే తన భార్యకు కూడా ఎంతో ఇష్టమంటూ వివరించాడు.
ఆమె వల్ల నేను ఎన్నోసార్లు మీ పిల్ల జమిందార్ సినిమా చూడాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని ఎన్టీఆర్ వివరించాడు. ఇక ఈ సినిమాకు తాజాగా కల్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నాగశ్విన్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతికి నాని నటించిన పిల్ల జమిందార్ సినిమా అంటే ఇష్టమంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న సినిమాల కంటే.. నాని పిల్ల జమిందార్ అంటే అంత ఇష్టమా వదినా అంటూ.. పదే పదే ఒకే సినిమాని చూసి మా అన్నను అంతగా ఇబ్బంది పెట్టేస్తున్నారా ఏంటి వదిన అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.