సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీస్ హోదా సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుంది. ఆ క్రేజ్ నిలబెట్టుకోవాలన్న అంతే శ్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే తముకోవచ్చే కథ, కంటెంట్ విషయంపై ఎంతో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఇప్పటికే చాలామంది స్టార్ హీరో, హీరోయిన్‌లు చాలామంది కంటెంట్ నచ్చిన ఆ కథ తమకు సెట్ కాదనే ఉద్దేశంతో.. లేదంటే మరేదైనా ఉద్దేశంతో ఎన్నోసార్లు త్యాగం చేస్తూ ఉంటారు. అలా తమకు వచ్చిన హిట్ సినిమా అవకాశాలను వేరొకరికి త్యాగం చేసిన వారిలో మన టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా ఉన్నారు. అలా తమకు వచ్చిన హిట్ సినిమా ఆఫర్లను వేరొకరితో త్యాగం చేసిన స్టార్ హీరోలు లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
24 :
సౌత్ స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న సూర్య కెరీర్‌లోనే.. అద్భుతమైన సినిమాగా ఈ సినిమాలో 24 ఒకటి. ఇక మొదట ఈ సినిమాను మహేష్ బాబుకు వినిపించారట డైరెక్టర్. అయితే ఇలాంటి ఓ ప్రయోగాత్మక సినిమా చేయాలంటే నేను సెట్ కాను.. ఈ సినిమాలో కథ ప్రకారం హీరోగా సూర్య అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటూ తనకు వచ్చిన హిట్ కథను సూర్యకు త్యాగం చేశారట మహేష్.
ఖైదీ :
టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్న కృష్ణ.. ఖైదీ కథ వినగానే తనకు సబ్జెక్టు బాగా నచ్చిందని.. అయితే ఆ సబ్జెక్టు నేను సెట్ కాను.. హీరో చిరంజీవి అయితే చాలా బాగా ఉంటుంది అని చిరంజీవితో సినిమా చేయమంటూ సజెస్ట్ చేశారట.
చంద్రముఖి 2 :
చంద్రముఖి, చంద్రముఖి 2 సిరీస్ టాలీవుడ్ లో ఎలాంటి సక్సెస్ అందుకున్నాయా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మొదట రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ కోసం కూడా మొదట రజనీకాంత్ ని సంప్రదించాడట దర్శకుడు. ఆ కథ విన్న తర్వాత దీనిని నేను చేయడం కంటే రాఘవ లారెన్స్ అయితే బాగా సెట్ అవుతారని సలహా ఇచ్చాడట రజిని. అలా తనకు వచ్చిన సినిమాను లారెన్స్ కు ఇచ్చేశాడు.
బిమ్లా నాయక్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన భీమ్లా నాయక్‌ల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలాంటి పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను మొదట బాలకృష్ణ హీరోగా చేయాల్సిందట. కథ విన్న తర్వాత ఇలాంటి కథలో నాకంటే పవన్ కళ్యాణ్ కి బాగా సెట్ అవుతుందని సలహా ఇచ్చి.. తన కథను పవన్ కళ్యాణ్ కు త్యాగం చేశాడట బాలయ్య.