తన సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు.. తారక్ భార్యకు ముద్దు పేరుగా పెట్టుకున్నాడుగా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి జోడి టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది క్యూట్ జోడిగా భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. ఈ జంట సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తారక్‌ భార్య లక్ష్మీ ప్రణ‌తి సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటుంది. ఫ్యామిలీకి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ అమ్మడు.. భర్త, పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్‌ చేస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా లక్ష్మి ప్రణతి అంటే ఎంతో ఇష్టమని.. ఎన్నో సందర్భాల్లో వివరించాడు.

అయితే ఎన్టీఆర్ తన భార్యను ముద్దుగా అమ్ములు అని పిలుచుకుంటూ ఉంటారని.. అలా పిలవడం తనకు కూడా ఇష్టమంటూ ఓ వార్త నెటింట‌ వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్ హీరోగా.. సమంత, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించిన రామయ్య వస్తావయ్య సినిమాలో శృతిహాసన్ ముద్దు పేరు కూడా అమ్ములు అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందు నుంచే లక్ష్మీ ప్రణతిని అమ్ములు అని పిలుస్తారా.. లేదా ఈ సినిమా తరువాత నుంచి అలా ప్రణతిని తారక్ పిలవడం మొదలుపెట్టాడో తెలియదు కానీ.. అమ్ములు అనే పేరు మాత్రం లక్ష్మి ప్రణతికి ఎంతో అద్భుతంగా సెట్ అయిందని.. అది కూడా తారక్ అలా పిలవడం ఊహించుకుంటుంటే ఎంతో క్యూట్ గా అనిపిస్తుందని తారక్ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూట్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

రికార్డ్ స్థాయి స్క్రీన్స్‌పై సోలోగా ఈ సినిమా రిలీజ్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. దసరా కానుకగా సినిమా రిలీజ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. దేవర తో పాట్టు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల లైన‌ప్ కూడా అదిరిపోయే రేంజ్ లో సెట్ చేసుకుంటున్నాడు తారక్. తాను నటించే ప్రతి సినిమాకు తన గతంలో సినిమా కంటే మించిన సక్సెస్ అందుకోవాలని.. క‌సితో అన్ని సినిమాలో నటిస్తూ ఉంటాడు. అలాగే రెమ్యూనరేషన్ పరంగా కూడా ముందంజలో ఉన్న ఎన్టీఆర్.. అంతకంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ సినిమా పరంగా దూసుకుపోతున్నాడు. త్వరలోనే ఎన్టీఆర్ నుంచి రానున్న దేవర.. ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.. ఈ సినిమాతో తారక్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో.. వేచి చూడాలి.