నందమూరి నటసింహం బాలయ్య, కొల్లి బాబి డైరెక్షన్‌లో తన 1009వ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త బయటకు వచ్చినా నెటింట క్షణాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలయ్య అభిమానులు కూడా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య వరుస హాట్రిక్ హీట్లతో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో బాలయ్యతో నటించేందుకు టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అలాంటిది ఓ స్టార్ బ్యూటీ తనకు బాలయ్య సినిమాలో నటించే అవకాశం వచ్చిన రిజెక్ట్ చేసిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు.. ఆ సినిమాను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమాతో పాపులారిటీ దక్కించుకున్న సెలబ్రిటీలో అశ్రిత వేముగంటి కూడా ఒకటి. ఈ సినిమా తర్వాత తెరకెక్కిన యాత్రతో మరింత పాపులర్ అయింది అశ్రితా.
ప్రస్తుతం లిమిటెడ్ సినిమాలో నటిస్తూ కెరీర్ కొనసాగిస్తున్న ఆశ్రిత ఎన్బికె 109 సినిమాలో ఓ కీలకపాత్రలో నటించే ఛాన్స్ వచ్చిందంటూ వివరించింది. అయితే కథ నచ్చిన సినిమాకు ఓకే చెప్పలేకపోయానని చెప్పుకొచ్చింది. దానికి కారణం సినిమా అవుట్ డోర్ షూట్ కావడమే అంటూ వివరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ వైరల్ అవడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇలాంటి చెత్త కారణంతో బాలయ్యతో నటించే మంచి అవకాశాన్ని వదులుకున్నావా అంటూ.. ఇలాంటి జాక్‌పాట్ ఆఫర్ రిజెక్ట్ చేసినందుకు నువ్వు నిజంగా అన్ లక్కీ ఫెలోనే అంటూ.. ఆశ్రితా పై ఫైర్ అవుతున్నారు బాలయ్య ఫ్యాన్స్.