ఇండియన్ సినీ హిస్ట‌రీలో ఒకే రికార్డును 4 సార్లు బ్రేక్ చేసిన ఏకైక స్టార్ ప్రభాస్ రాజు..!

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ప్రభాస్. ఈ సినిమాతో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్న రెబల్ స్టార్.. తర్వాత అని పానH ఇండియా సినిమాలోనే నటించాడు. అయితే కొంతకాలం వరకు ఈ సినిమాలేవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. అయినా ప్రభాస్ మార్కెట్ ఏమాత్రం తగ్గలేదన‌టంలో అతిశ‌యోక్తి లేదు. ఇక గ‌తేడాది సలార్ మూవీ దాదాపు రూ.700 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే.

Baahubali 1 vs Baahubali 2: Here's how Prabhas-Rana's sequel beats the  original before release - Bollywood News & Gossip, Movie Reviews, Trailers  & Videos at Bollywoodlife.com

ఈ క్రమంలో తాజాగా నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన కల్కి.. సలార్ సక్సెస్ పరంపరను కొనసాగించింది. ఇప్పుడు కల్కి 2898 ఏడి మూవీ గ్లోబల్ లెవెల్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రోజుకో రికార్డును క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే రూ.700 కోట్ల గ్రామసులను క్రాస్ చేసిన‌ ఈ సినిమా బేయి కోట్ల‌వైపుగా పరుగులు తీస్తోంది. ఇక ఈ సినిమాతో ప్రభాస్ రూ.600 కోట్లు కొల్లగొట్టిన నాలుగో సినిమాగా రికార్డ్ సృష్టించాడు.

Saalar advance booking: Prabhas' action drama eyes a monstrous start by  zooming past $180K mark in the US, know where Kalki AD 2898 stands

ఇప్పటివరకు బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలతో రూ.600 గ్రాస్‌ వసూళు కొల్లగొట్టిన ఈయన.. చివరిగా స‌లార్‌ సినిమాతో రూ.600 కోట్లు గ్రాస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు కల్కితో మరోసారి రూ.600 కోట్లు కొల్ల‌గొట్టి రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఇండియా సినీ చరిత్రలోనే ప్రభాస్ సృష్టించిన రికార్డ్‌ను ఎవరు క్రియేట్ చేయలేకపోయారు. ఏకంగా నాలుగు సినిమాలతో రూ.600 కోట్లు కొట్టడం అంటే సాధారణ విషయం కాదని.. అది మా ప్రభాస్ రేంజ్ అంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.