ఆ హీరోయిన్ త‌ప్పా నీకు ఎవ్వ‌రు దొర‌క‌లేదా ప్ర‌భాస్‌… ఫ్యాన్ ఫైర్‌..?

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌రుప ఫ్లాపుల తర్వాత వరస విజయాలను అందుకుంటు దూసుకుపోతున్నాడు. ప్రభాస్ చివరిగా వచ్చిన చివ‌ర రేండు సినిమాలు స‌లార్, కల్కి 2898 ఏడి ల‌తో రికార్డ్‌లు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ అయిన కల్కి రికార్డులతో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది. ఈ సినిమా హిట్ కావడంతో డైరెక్ట‌ర్‌ నాగ్‌ ఆశ్విన్‌ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్ర‌జెంట్ పాన్ ఇండియా లెవెల్లో ఎటు చూసినా ఆశ్విన్ పేరు మారుమోగిపోతుంది. ఈ సినిమా హాలీవుడ్ విజువల్స్‌తో హై బడ్జెట్‌లో తెర‌కెక్కించడంతో.. నెటిజ‌న్స్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో కల్కి తర్వాత ప్రభాస్‌కు మరిన్ని అవకాశాలు క్యూ కడుతున్నాయట. ఈ నేప‌ద్యంలో ప్రభాస్ ప్రస్తుతం హ‌నురాగపూడి డైరెక్షన్లో ఓ సినిమా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన వర్క్ కూడా మొదలుపెట్టారని టాక్. రెబల్ స్టార్ ఆర్మీ సైనికుడగా కనిపిస్తున్న ఈ సినిమాలో ఓ పాకిస్తాన్ హీరోయిన్‌ను సెలెక్ట్ చేసినట్లు టాక్ న‌డుస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ఇదే విషయంపై దీర్ఘ చర్చ జరిపారని.. ఆమెనే చివరకు హీరోయిన్గా ఫిక్స్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమె ఎవరో కాదు వ్రీదేవి మామ్ సినిమాలో నటించిన సాజన్ అలీ. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా.. ప్రస్తుతం ప్రభాస్ పాకిస్తాన్ బ్యూటీతో రొమాన్స్ చేయ‌నున్నాడంటూ వార్తలు నెటింట‌ వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానులే ఆయన పై ఫైర్ అవుతున్నారు. నీకు ఈ పాకిస్తాన్ అమ్మాయి తప్ప మరి ఎవరు హీరోయిన్గా దొరకలేదా అంటూ ఫైర్ అవుతున్నారు.. అన్న ద‌య‌చేసి ఆమెతో మీరు సినిమాలో న‌టించ‌కండి అన్న అంటూ త‌మ అభిప్రాయాని వ్య‌క్తం చేస్తున్నారు.