తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది హీరోయిన్ నివేదా పేతురాజ్. ఈ తమిళ సోయగం మధురైలో పుట్టి పెరిగి తమిళ్ సినిమాల ద్వారా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా.. అక్కడ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ ఛాన్స్‌లను దక్కించుకొని ఉదయినిది స్టాలిన్, జయం రవి, విజయ్ ఆంటోనీ, విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అలాగే టాలీవుడ్ లో అల్లు అర్జున్ అలవైకుంఠపురం, రెడ్ లాంటి సినిమాల్లో నటించి హిట్‌లు తన ఖాతాలో వేసుకుంది. అయితే ప్రస్తుతం నివేదా పేతురాజ్‌కు టాలీవుడ్ లో కూడా అవకాశాలు తగ్గాయి.
దీంతో వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టి రీసెంట్గా పరువు వెబ్ సిరీస్ లో అవకాశాన్ని దక్కించుకుంది. ఆమె నటించిన ఈ సిరీస్ ఓటీటీ ప్లాట్ ఫాంపై రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా మాట్లాడుతూ.. తనకు సంబంధించిన షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. నాకు మొదటి నుంచి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలన్న కోరిక ఉండేదని వివరించింది. ఆమె మాట్లాడుతూ నాకు ప్లమ్ లిప్స్ అంటే చాలా ఇష్టం అని.. నా పెదవులు కూడా అలా మార్చుకోవడానికి సర్జరీ చేయించుకోవాలనుకున్న.. దానికోసం మా ఫ్యామిలీ డాక్టర్ సజెషన్ అడిగా.. ఇంజక్షన్ తీసుకుంటావా అని ఆయన ప్రశ్నించాడు.. నేను దానికి ఓకే చెప్పా అంటూ చెప్పుకొచ్చింది.
ఇక అది విన్న డాక్టర్.. అయితే నిన్ను చంపేస్తా.. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అని సరదాగా బెదిరించారు. ఇలాంటివి అసలు మంచిది కాదని ఫ్యూచర్‌లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. దీంతో ఆ ఆలోచనలు విరమించుకున్న అంటూ నివేదా పేతురాజ్ వివరించింది. ప్రస్తుతం నివేదా చేసిన కామెంట్‌లు నెటింట వైరల్ అవ్వడంతో సాధారణంగా ఇలాంటి సర్జరీల విషయాలు స్టార్స్ సీక్రెట్గా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. అలాంటిది ఇమె ఇంత ఓపెన్‌గా చెప్పేసిందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.