సౌత్ ఇండస్ట్రీలో తిరగలేని స్టార్ బ్యూటీగా దూసుకుపోతుంది నయనతార. కొన్ని సంవత్సరాల క్రితం చిన్న సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదటి తెలుగు సినిమాలో నటించి తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో అవకాశాలను దక్కించుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ పై కాకుండా తమిళ్ ఇండస్ట్రీ పై ఆసక్తి పెట్టిన నయన్.. తెలుగు సినిమాలను చాలా వరకు తగ్గించేసింది. ప్రస్తుతం కూడా కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. అయితే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలో నయన్ నటించిన ప్రమోషన్స్ కు మాత్రం ఎప్పుడూ అటెండ్ కాదు.
దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గతంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన జవాన్. అంత పెద్ద స్టార్ హీరో తో పాన్ ఇండియా లెవెల్ సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె కండిషన్స్ మాత్రం బ్రేక్ చేయలేదు. ఇక దీంతో నయన్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అయినా తన కండిషన్స్ బ్రేక్ చేయదు. ఎప్పుడు ఏ సినిమా ప్రమోషన్స్ కు వెళ్లదని ఫిక్స్ అయిపోయారు జనం. అయితే తాజాగా ఈమె జనాలకు పెద్ద షాక్ ఇచ్చింది. విష్ణువర్ధన్ డైరెక్షన్లో రూపొందిన నిస్సిపాయ మూవీలో నటించిన ఈ అమ్మడు తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ కు పాల్గొని సందడి చేసింది.
ఈ వెంట్ కు బ్లాక్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌస్ లో సింపుల్ లుక్ తో దర్శనమిచ్చింది. ఈ ఇవెంట్లో ఆమెను చూసినా అభిమానులంతా ఫిదా అవుతున్నారు. నయన్ చీరకట్టు.. అందం, అద్భుతం అంటూ పొగిడేస్తున్నారు. ఇక వేడుకలు నయనతార మాట్లాడుతూ అసలు ఎప్పుడు ప్రమోషన్స్‌కు రాని తాను విష్ణువర్ధన్ సినిమా ఈవెంట్ కు రావడానికి కారణం ఇదే అంటూ వివరించింది. నేను నిస్సపాయ మూవీ ప్రమోషన్స్ కు రావడానికి ఒకటే కారణం. ఇది మంచి ఫ్యామిలీ మూవీ అందుకే ఈ ఈవెంట్ కు హాజరయ్యా అంటూ వివరించింది. ప్రస్తుతం నయన్ ఈవెంట్లో సందడి చేయడంతో సినిమాకు మరింత పబ్లిసిటీ పెరిగింది. అలాగే సినిమా గురించి నయన్ చేసిన కామెంట్లు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి.