” అసలు రొమాన్స్ అంటే అలానే ఉండాలి “.. మృణాల్ బోల్డ్ కామెంట్స్ కు ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ ఫ్యాన్స్ఠాగూర్ మొదట బాలీవుడ్ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై రాణించింది. తర్వాత దుల్కర్ సల్మాన్ సీతారామమ్‌ సినిమాలో ఛాన్స్ కొట్టేసి హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ ద‌క్కించుకుంది. మొదటి సినిమాలో సాంప్రదాయ కట్టుబొట్టుతో.. అచ్చ తెలుగు ఆడపడుచులా.. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ అమ్మడు మొదటి సినిమా సక్సెస్ తో టాలీవుడ్ లో పలు సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది.

ఇక తాజాగా మృణాల్ ఠాగూర్ కల్కిలో గెస్ట్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసింది. ఇక ఈ సినిమాకు మృణాల్‌ ఒక రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నెటింట‌ వైరల్ అయింది. అందరి చేత ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ రొమాన్స్ గురించి చేసిన కామెంట్స్ నెటింట తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రొమాన్స్ అంటే నా దృష్టిలో మనకు నచ్చిన వాళ్ళు మనతో నిజాయితీగా ఉండడం.. అలాగే మనపై శ్రద్ధ చూపించడం అంటూ వివరించింది.

మనకోసం చిన్న చిన్న పనులు చేయడం.. ఎప్పుడు మన ఆలోచనలో ఉండ‌టం.. అసలు సిసలు రొమాన్స్. చిన్న టచ్ చాలు ఇతరులకు మనపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవడానికి.. రొమాన్స్ అంటే చిన్న చిన్న చిలిపి చేష్టలతోనే ఉంటుంది.. కానీ అది కొందరు దృష్టిలో మరో విధంగా ఉంటుంది అంటూ ఆమె వివరించింది. ప్రస్తుతం మృణాల్ రొమాన్స్ పై చేసిన బోల్డ్ కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి. దీంతో మృణ్‌ల్ ఫ్యాన్స్ అంతా అమ్మ‌డి కిమెంట్స్‌కు షాక్ అవుతున్నారు. మృణాల్ ఠాగూర్ లాంటి స్టార్ హీరోయిన్ కుడా రొమాన్స్ పై ఇంత మంచి ఒపీనియన్‌తో ఉంటారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇటీవల బాలీవుడ్ పై పూర్తి ఫోకస్ పెట్టిన మృణాల్ అక్కడ హీరో వరుణ్ దావత్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.