రికార్డుల వర్షం కురిపిస్తున్న ‘ కల్కి ‘.. సరికొత్త ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్.. ఇది ప్రభాస్ రాజు స్టామినా.. ?!

పాన్ ఇండియ‌న్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి. జూన్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్ల పరంగా ప్రొడ్యూసర్లకు లాభాల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ మరోసారి కల్కితో న‌యా ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేశాడు.

నార్త్ అమెరికాలో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కి 10.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇండియ నుంచి రిలీజ్ అయిన ఇప్పటివరకు అన్ని సినిమాల్లోని మొదటివారం కలెక్షన్లలో ఈ సినిమానే హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టింది. కొద్దిరోజులు కొనసాగిస్తే లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం పక్కా.

Kalki 2898 AD (@Kalki2898AD) / X

ఇక ఈ భారీ బడ్జెట్ మూవీలో దీపిక పదుకొనే, దిశాపటాన్ని, కమలహాసన్, అమితాబచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శోభన, మాలవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో మెప్పించారు. ఇక టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి గెస్ట్ రోల్‌లో నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ తెరకెక్కిన ఈ సినిమాకు సంతోష్ నారాయణ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు.