బ‌న్నీ – చ‌ర‌ణ్ మ‌ధ్య గొడ‌వ‌కు ఇప్ప‌ట్లో ఫుల్‌స్టాప్ ప‌డ‌దా… మ‌రోసారి..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్యన కెరీర్ ప్రారంభంలో ఎలాంటి బాండింగ్ ఉండేదో.. వీరిద్దరి మధ్య ఎలాంటి ఆప్యాయతలు ఉండేవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాను, రాను సినిమాల పరంగా వీరిద్దరి మధ్యన కోల్డ్ వార్ మొదలైందని.. సినిమాల విషయంలో మొదలైన ఈ వార్ పర్సనల్ విషయాలలోనూ పోటీపడేంతగా పెరిగిపోయిందని.. వార్తలు గతంలో ఎన్నోసార్లు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోల మధ్యన ఉన్న కోల్డ్ వార్ కాస్త అల్లు, మేగా ఫ్యామిలీల మధ్యన వార్‌గా మారిపోయింది అంటూ.. ఈ ఇరు కుటుంబాల‌మ‌ధ్య గొడ‌వ‌లు ముదురుతున్నాయంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇక మెగా ఫ్యామిలీ ఇమేజ్‌ను రిప్రజెంట్ చేస్తూ రామ్ చరణ్, అలూ ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తూ అల్లు అర్జున్ పాన్‌ ఇండియన్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గతంలో రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో, బ‌న్నీ పుష్పా సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ క్ర‌మంలో ఇద్దరి మధ్యన స్ట్రాంగ్ రేస్ మొదలైంది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ సరికొత్త పాన్ ఇండియా ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చరణ్, శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజ‌ర్‌ సినిమాలు నటిస్తుండగా.. అల్లు అర్జున్ చివరిగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్ప సీక్వెల్ గా పుష్ప 2 లో నటిస్తూ బిజీగా గ‌డుపుతున్నారు.

ఈ రెండు సినిమాలు ఎప్పుడు సెట్స్‌పైకి వస్తాయంటూ ఇటు మెగా అభిమానులతో పాటు.. అల్లు అభిమానులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో వీరిద్దరి మధ్యన మరోసారి కోల్డ్ వార్ మొదలుకానుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజ‌ర్‌ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరి సినిమాకు కేవలం రెండు వారాల గ్యాప్ మాత్రమే వస్తుంది. ఈ క్రమంలో ఎంత లేదన్న వీరిద్దరి మధ్య పోటీ నెలకొంటుంది. దీంతో మరోసారి వీరిద్దరి మధ్యన సినిమాల విషయంలో కోల్డ్ వార్ మొదలవుతుందని.. ఇప్పట్లో చరణ్ – బన్నీ మధ్య గొడవలకు ఫుల్స్టాప్ పడేలా లేదంటూ నెటింట కామెంట్లు వినపడుతున్నాయి.