సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ప్రేమలు, పెళ్లి, బ్రేకప్‌ల వార్తలు తెగ వినిపిస్తున్నాయి. తమ కో స్టార్లతో ప్రేమలో పడడం.. కొన్నాళ్లకే వివాహం చేసుకోవడం, పెళ్లయిన కొన్ని రోజులకే విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. పేరుకు ప్రేమించి వివాహం చేసుకున్న.. ముచ్చటకు మూడేళ్లు కూడా కలిసి ఉండకుండా డివోర్స్ తీసేసుకుంటున్నారు. అంతేకాదు చిన్న చిన్న గొడవలతో పాతికేళ్లు కలిసి సంసారం చేసి పిల్లలు ఉన్న జంటలు కూడా చిట్టుకున విడిపోతున్నాయి.
అలా ఇప్పటికే మన టాలీవుడ్ లో ఇటీవల కాలంలో సమంత – నాగచైతన్య, ధనుష్ – ఐశ్వర్య , హార్దిక్ పాండే – నటాషా, నిహారిక – చైతన్య, శ్రీజ – కళ్యాణ్ దేవ్, పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్, అమీర్ ఖాన్ – కిరణ్‌రావ్ ఇలా ఎన్నో స్టార్ సెలబ్రిటీ జంటలు విడిపోయిన వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో చరణ్‌కు సినిమాలో చెప్పిన డైలాగులు గుర్తు చేసుకుంటూ.. ఆయన ముందే ఇలాంటి పరిస్థితులు వస్తాయని.. ఇలాంటి వాళ్ళ కోసమే ఆ డైలాగ్ చెప్పినట్టు ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో చరణ్ చెప్పిన ఓ డైలాగ్ ను హైలెట్ చేస్తూ తెగ కామెంట్లు చేస్తున్నారు. గతంలో రాంచరణ్ ఆరెంజ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఆ రోజుల్లో ఈ సినిమా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే రీరిలీజ్‌లో మాత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో చరణ్ ఎవరికైనా ప్రేమ కొంతకాలమే బాగుంటుంది.. తర్వాత బాగోదు.. విడిపోవాలనిపిస్తుంది అంటూ డైలాగ్ చెప్తాడు. ప్రస్తుతం చరణ్ చెప్పిన ఈ డైలాగ్ సెలబ్రిటీల వరుసవిడాకుల వార్తలకు పర్ఫెక్ట్ క్యాప్షన్ గా అనిపిస్తుంది. 13 ఏళ్ళు క్రితమే ప్రేమ పెళ్లి గురించి పచ్చి నిజాలు ఆ రిలేషన్షిప్ లో ఉండే వివాదాల గురించి నిక్కచ్చిగా చెప్పుకొచ్చాడు. అయితే తన లైఫ్ పార్టనర్‌ను మాత్రం చరణ్ చాలా జాగ్రతగా ఎంచుకున్నాడు.. తన రియల్ లైఫ్ లో భార్య ఉపాసనని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు.. ప్రస్తుతం ఈ జంట హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే.