సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు.. మొదటి చిన్న పాత్రలతో మొదలై.. తర్వాత స్టార్ హీరోలుగా ఎదిగిన వారే. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు ఎవరో కొంతమంది మాత్రం మొదటి నుంచి స్టార్ హీరోలు అయిపోయి ఉండొచ్చు. కానీ.. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈ జనరేషన్ విజయ్ దేవరకొండ వరకు ఉన్న స్టార్ హీరోలంతా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి చిన్న చిన్న వేషాల్లో నటించి క్రేజ్ సంపాదించుకున్న తర్వాత హీరో అవతారాలు ఎత్తిన వాళ్లే. ఇక హీరో అడవిశేష్ కూడా అదే కోవకు చెందుతాడు. పంజా, బాహుబలి, బలుపు లాంటి సినిమాల్లో మొదటి నెగటివ్ రోల్స్‌లో నటించిన ఈయన.. ఆ సినిమాల్లో అసలు ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించాడు. అయితే అడవి శేష్.. ఇండస్ట్రీకి రావడానికి అసలు గోల్ అది కాదట.
మంచి నటుడుగా, హీరోగా క్రేజ్‌ను సంపాదించుకోవాలని కోరికతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని.. అలాంటిది అర్థం పర్థం లేని.. ఇష్టం లేని పాత్రలు చేస్తూ కెరీర్ నాశనం చేసుకుంటున్నానని నాకే ఆలోచన మొదలైందని.. అడవి శేషు గతంలో జరిగిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రవితేజ , గోపీచంద్ మల్లి నేను డైరెక్షన్ లో వచ్చిన బలుపు సినిమాలో నెగటివ్ రోల్ ప్లే చేసిన అడవి శేష్.. తనకు ఆ పాత్రలో నటించడం ఏమాత్రం నచ్చలేదని. ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చాను.. ఎలాంటి పాత్రలు చేస్తున్నాను అని మదన పడిపోయానని.. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయినా.. నా పాత్ర అసలు ఉపయోగం లేని పాత్ర అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో శృతిహాసన్‌ను లాక్కొని వెళ్తున్న సీన్ చేసేటప్పుడు నాపై నాకే అసహ్యం వేసింది అని.. దీంతో బలుపు సినిమా తర్వాత నేను ఎలాగైనా మారాలి.. నా యాంబిషన్ నిలబెట్టుకోవాలి.. అనే కసి నాలో పెరిగిందని వివరించాడు.
అయితే ఈలోపే బాహుబలి అవకాశం రావడంతో.. నటించి. తర్వాత కసితో ప్లాన్ చేసుకుంటూ వరుస సినిమా అవకాశాలు వచ్చేలా ప్రయత్నించా. ఫుల్ లెన్త్ హీరోగా ఐదు సినిమాల్లో నటించా. ఐదు సినిమాలు బ్లాక్ బాస్టర్ సక్సెస్ గా నిలిచిన సంగతి తెలిసిందే అంటూ వివరించాడు. క్షణం సినిమా నా కెరీర్ మలుపు తిప్పిందని.. ఈ సినిమా తర్వాత కూడా గూఢాచారి, ఎవరూ, మేజర్, హిట్ 2 ఇలా వరుసగా 5 సార్లు నా సినిమాలకు విజయం దక్కిందని చెప్పుకొచ్చాడు. ఇక పంజా లాంటి సినిమాలో నటించినప్పుడు నన్ను ఎవరు తెలుగు అబ్బాయిల అనుకోలేదని.. నా ఫేస్ చూసి వీడెవడో నార్త్ అబ్బాయి అని భావించారని.. పవన్ అయితే నన్ను చూడగానే.. హిందీలో మాట్లాడడం మొదలు పెట్టేసారని.. సార్ నేను తెలుగు వాడిని. నాతో తెలుగులో మాట్లాడండి అని నేను చెప్పానని నవ్వుతూ వివరించాడు. ఇక ఒకప్పుడు శృతిహాసన్ సినిమాలో విలన్‌గా చిన్న పాత్రలో నటించిన అడవి శేష్.. ఇప్పుడు అదే హీరోయిన్ తో సినిమాలో రొమాన్స్ చేసే స్టేజ్ కు ఎదిగాడు. ప్రస్తుతం శృతిహాసన్‌తో అడవి శేష్ డేకాయిట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.