చరణ్‌ను కాద‌ని బన్నీకి హిట్ స్టోరీ ఇచ్చేసిన చిరు… అలా ఎందుకు చేశాడ‌బ్బా..?

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా మేగా పవర్ స్టార్ రాంచరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. త‌న ప్ర‌తి సినిమాతో ఒక్క మెట్టు ఎదుగుతూ ప్రస్తుతం పాన్‌ ఇండియ స్టార్ హీరోగా గ్లోబల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు చరణ్. ఇక మెగా హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్ కూడా అదే రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. మొదటి నుంచి చరణ్‌ను చిరంజీవి ఎలా ఎంకరేజ్ చేసేవారో.. బ‌న్నీని కూడా అదే విధంగా ఎంక్రేజ్‌చేశారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కాగా ప్రస్తుతం చరణ్, బన్నీల మధ్యన కోల్డ్ వార్ నడుస్తుందంటూ.. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలు చాలా దూరం అయ్యాయి అంటూ వార్త‌లు తెగ వైరల్ అవుతున్నాయి. అయినా మెగాల్లు ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా దీనిపై స్పందించలేదు. ఇక అల్లు అర్జున్ మెగా హీరోగా ఇండస్ట్రీకి వచ్చినా తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో అల్లు బ్రాండ్ ప్రమోట్ చేసుకుంటూ అల్లు అర్జున్.. మెగ ఇమేజ్ పెంచుకుంటూ రాంచరణ్ గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇద్దరికీ సంబంధించిన ఓ వార్త‌ వైరల్‌గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ కు వచ్చిన ఓ మంచి కథను అల్లు అర్జున్ కు ఇచ్చేసాడంటూ.. దాంతో అల్లు అర్జున్ సూపర్ హిట్ అందుకున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ కెరీర్‌ ప్రారంభంలో మొదటి సినిమాగా గంగోత్రి సినిమాను తెర‌కెక్కించాలని.. మొదట ఈ మూవీ డైరెక్టర్ రాఘ‌వేంద్ర రావు భావించారట. ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పగా.. ఇంకా చరణ్‌ యాక్టింగ్ పూర్తిగా నేర్చుక‌లేదు.. ఈ స్టోరీ బన్నీకి అయితే బాగా సరిపోతుంది.. అల్లు అర్జున్తో ఈ సినిమాను తీద్దామని వివరించారట. దీంతో అల్లు అర్జున్‌తో గంగోత్రి సినిమా తెర‌కెక్కించారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ కెరీర్ లో మొదటి సినిమాగా వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది.